Share News

విశ్వ విజేత జర్మనీ

ABN , Publish Date - Aug 31 , 2026 | 03:50 AM

డిఫెండింగ్‌ చాంప్‌ జర్మనీ.. హాకీ పురుషుల వరల్డ్‌కప్‌ టైటిల్‌ను నిలబెట్టుకొంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ 1-0తో...

విశ్వ విజేత జర్మనీ

  • ఫైనల్లో 1-0తో స్పెయిన్‌పై గెలుపు

  • నాలుగోసారి టైటిల్‌ సొంతం

  • అర్జెంటీనాకు కాంస్యం

బెల్‌ఫియస్‌ (బెల్జియం): డిఫెండింగ్‌ చాంప్‌ జర్మనీ.. హాకీ పురుషుల వరల్డ్‌కప్‌ టైటిల్‌ను నిలబెట్టుకొంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ 1-0తో స్పెయిన్‌ను ఓడించింది. 44వ నిమిషంలో స్ట్రుతోఫ్‌ ఏకైక గోల్‌ సాధించాడు. నాలుగోసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడిన జర్మనీ అత్యధిక టైటిళ్లు సాధించిన పాకిస్థాన్‌ (4) రికార్డును సమం చేసింది. ఆఖరి క్వార్టర్‌లో పూర్తిగా రక్షణాత్మకంగా వ్యవహరించిన జర్మనీ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని.. వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఇక, కాంస్యపతక పోరులో అర్జెంటీనా 2-1తో నెదర్లాండ్స్‌పై గెలిచింది. కాగా శనివారం జరిగిన మహిళల విభాగం ఫైనల్లో అర్జెంటీనా షూటౌట్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి ప్రపంచ కప్‌ను అందుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి

ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజా

Updated Date - Aug 31 , 2026 | 03:50 AM