Share News

అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన అమేలియా కెర్

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:39 AM

న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ అమేలియా కెర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. వరుసగా 10 అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 30+ స్కోరు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచింది.

అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన  అమేలియా కెర్
Amelia Kerr

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ అమేలియా కెర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పురుషుల, మహిళల విభాగంలో మరెవరికీ సాధ్యంకాని ఘనతను ఆమె సాధించింది. వరుసగా 10 అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 30+ స్కోరు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచింది. తాజాగా సౌతాఫ్రికాతో పొట్టి సిరీస్‌లో భాగంగా ఆడిన నాలుగో టీ20లోనూ కెర్ 29 బంతుల్లో 31 పరుగులు చేసింది. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ 3-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.


అమేలియా కెర్ వరుసగా 10 ఇన్నింగ్స్‌ల్లోనూ 30 అంతకంటే ఎక్కువ చేయడం గమనార్హం. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక ప్లేయర్ చమరి ఆటపట్టు, రొమానియాకు చెందిన రెబెక్కా బ్లేక్ పేరిట ఉండేది. వీరిద్దరూ తొమ్మిదిసార్లు చొప్పున ఇలాంటి ఫీట్ సాధించారు. ఇప్పుడు కెర్ ఆ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. గత పది మ్యాచుల్లో ఆమె 554 పరుగులు చేసింది. అయితే ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.


మ్యాచ్ వివరాలిలా..

  • 2024- దక్షిణాఫ్రికాపై 43(38)

  • 2025- ఆస్ట్రేలియాపై సిరీస్: 51(46 బంతులు), 40 (36 బంతులు), 66 (47 బంతులు), 101

  • 2026- జింబాబ్వేపై 82 (52 బంతులు)

  • 2026- దక్షిణాఫ్రికాపై సిరీస్: 78 (44 బంతులు), 32(18 బంతులు), 30 (28 బంతులు), 31 (29 బంతులు)

  • బౌలర్‌గా ఈ పది మ్యాచుల్లో కెర్ 12 వికెట్లు తీసింది.


ఇవి కూడా చదవండి:

ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!

Updated Date - Mar 23 , 2026 | 08:21 AM