Share News

ప్రమోద్‌ డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:33 AM

పారాలింపిక్స్‌ చాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌ స్పానిష్‌ పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలతో ఔరా అనిపించాడు...

ప్రమోద్‌ డబుల్‌ ధమాకా

స్పానిష్‌ పారా బ్యాడ్మింటన్‌లో రెండు స్వర్ణాలు

విటోరియా (స్పెయిన్‌): పారాలింపిక్స్‌ చాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌ స్పానిష్‌ పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలతో ఔరా అనిపించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-3 విభాగం ఫైనల్లో నితీశ్‌ కుమార్‌పై 21-17, 10-21, 21-18తో నెగ్గిన ప్రమోద్‌ పసిడి చేజిక్కించుకున్నాడు. అనంతరం మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌ఎల్‌-3 తుది పోరులో మనీషా రామదాస్‌తో కలిసి 13-21, 21-12, 21-19తో బ్రెజిల్‌ ద్వయం రొజేరియా/ఎడ్వర్డ్‌ను చిత్తు చేసి రెండో స్వర్ణం అందుకున్నాడు. అలాగే సుకాంత్‌ తోడుగా పురుషుల డబుల్స్‌ ఎస్‌ఎల్‌-3ఎస్‌యూ-5 విభాగం టైటిల్‌ ఫైట్‌లో ప్రమోద్‌ 19-21, 14-21తో భారత్‌కు చెందిన నితీశ్‌ కుమార్‌/రుతిక్‌ రఘుపతి చేతిలో ఓడి రజత పతకం నెగ్గాడు.

ఇవి కూడా చదవండి:

ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!

Updated Date - Mar 23 , 2026 | 06:34 AM