దక్షిణాఫ్రికా ఆశలు సజీవం
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:30 AM
స్పిన్నర్లు ప్రనేలన్ సుబ్రాయన్ (2/13), కేశవ్ మహరాజ్ (2/22) కీలక సమయాల్లో రాణించిన వేళ న్యూజిలాండ్‌తో జరిగిన...
కివీ్‌సపై నాలుగో టీ20లో గెలుపు
వెల్లింగ్టన్: స్పిన్నర్లు ప్రనేలన్ సుబ్రాయన్ (2/13), కేశవ్ మహరాజ్ (2/22) కీలక సమయాల్లో రాణించిన వేళ న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో దక్షిణాఫ్రికా 19 పరుగులతో విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సను 2-2తో సమం చేసింది. అంతేకాదు సిరీస్ దక్కించుకొనే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత సఫారీలు 20 ఓవర్లలో 164/5 స్కోరు చేశారు. కానర్ ఎస్తేరూజెన్ (57) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కైల్ జేమిసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఓ మోస్తరు స్కోరు ఛేదనలో న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. టిమ్ రాబిన్సన్ (32) రాణించాడు.
ఇవి కూడా చదవండి:
ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు
చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!