వైభవ్ అరంగేట్రం.. సంజు శాంసన్‌ను మర్చిపోవద్దు: అంబటి రాయుడు
ABN , Publish Date - Jul 05 , 2026 | 03:10 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయిన సంజును జట్టు నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ విషయంపై మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వరుస మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్‌ను బరిలోకి దింపారు. టీ20 ప్రపంచ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయిన సంజును జట్టు నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ విషయంపై మాట్లాడాడు.
‘వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఆనందించదగిన విషయం. కానీ సంజు శాంసన్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. అతడు టీ20 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’. సంజు శాంసన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైభవ్ డెబ్యూ గురించి ఆనందం పడటంలో తప్పు లేదు. కానీ సంజును ఎవరూ మర్చిపోవద్దు’ అని అంబటి రాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. ఇదే సమయంలో యువ ప్లేయర్ వైభవ్‌కు కూడా రాయుడు శుభాకాంక్షలు తెలిపాడు. అతనికి సుదీర్ఘ క్రికెట్ కెరీర్ ఉండాలని ఆకాంక్షించారు.
ఐర్లాండ్ సిరీస్, ఇంగ్లండ్‌తో తొలి టీ20లో సంజు శాంసన్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో రెండో టీ20కి అతడిని పక్కన పెట్టి జట్టులో మార్పులు చేశారు. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీకి అరంగేట్ర అవకాశం ఇచ్చారు. అరంగేట్ర మ్యాచ్‌లో వైభవ్ 10 బంతుల్లో 14 పరుగులు చేసి రెండు భారీ సిక్సర్లతో తన దూకుడు చూపించాడు. అయితే ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
ఇవి కూడా చదవండి:
మహిళల టీ20 ప్రపంచ కప్: స్మృతి మంధానకు ప్రత్యేక గుర్తింపు
సచిన్ నుంచి వైభవ్ వరకు.. 37 ఏళ్లలో ఎంత మార్పు!