Share News

అభిషేక్ శర్మ సంచలనం.. సూర్యకుమార్ యాదవ్ రికార్డు బ్రేక్..

ABN , Publish Date - Oct 15 , 2026 | 09:00 AM

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. టీ-20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు.

అభిషేక్ శర్మ సంచలనం.. సూర్యకుమార్ యాదవ్ రికార్డు బ్రేక్..
Abhishek Sharma

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. టీ-20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ-20 మ్యాచ్‌లో అభిషేక్ ఈ ఘనత సాధించాడు. దీంతో గతంలో సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు (Abhishek Sharma world record).


2022లో సూర్యకుమార్ యాదవ్ టీ-20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో 68 సిక్సర్లు బాదాడు. ఇప్పటివరకు ఈ ప్రపంచ రికార్డు సూర్యకుమార్ పేరిట ఉండేది. అయితే 2026లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న అభిషేక్ శర్మ తాజాగా ఈ రికార్డును బద్దలుకొట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో తన 69వ సిక్సర్‌ను బాది ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ఒక ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు (Abhishek most sixes in T20I).


అంతర్జాతీయ టీ-20ల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి అభిషేక్ శర్మ తన దూకుడైన ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు (T20 cricket records). ముఖ్యంగా పవర్‌ప్లేలో బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తున్నాడు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా అవకాశం దొరికినప్పుడల్లా భారీ షాట్లు ఆడటం అతడి ప్రత్యేకత. 2026లో వరుసగా రికార్డులు సాధిస్తున్న అభిషేక్, భారత జట్టు బ్యాటింగ్‌లో కీలక ఆటగాడిగా ఎదిగాడు.


ఇవి కూడా చదవండి..

చైనా విడిభాగాలతో హూతీల క్షిపణులు.. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాకు ముప్పు తప్పదా..


మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 15 , 2026 | 09:35 AM