Share News

కోహ్లీ స్థానంలో అతడిని ఆడించాలి: ఆకాశ్ చోప్రా

ABN , Publish Date - Jun 12 , 2026 | 09:38 PM

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న శనివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీ స్థానంలో అతడిని ఆడించాలి: ఆకాశ్ చోప్రా
Aakash Chopra

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న శనివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు ఎంపిక చేస్తూ బీసీసీఐ ప్రకటించింది. అయితే కోహ్లీ ఆడే మూడో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.


‘ప్రస్తుతం ఇషాన్ కిషన్ దేవుడికి ఇష్టమైన వ్యక్తిలా అనిపిస్తున్నాడు. అతడిని నంబర్ 3లో బ్యాటింగ్‌కు పంపితే తప్పకుండా పరుగులు చేస్తాడు. ఇషాన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. జట్టులో ఎప్పుడు అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అదే అతడి ప్రత్యేకత. ‘అవకాశం’ అనే తలుపులు తెరుచుకోవడమే ఆలస్యం.. లోపలికి వచ్చేసి పరుగులు చేసి తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటాడు’ అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.


మరోవైపు భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ సమయంలో వెన్నునొప్పితో ఇబ్బంది పడిన హార్దిక్.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ సిరీస్‌కు ముందు నిర్వహిచిన ఫిట్‌నెస్ పరీక్షల్లో హార్దిక్ మళ్లీ గాయపడినట్లు సమాచారం. పునరావాస ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మూడు వారాలు పట్టే అవకాశం ఉండటంతో అతడు వన్డే సిరీస్‌లో ఆడే అవకాశమే లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.


ఇవి కూడా చదవండి:

సచిన్, కోహ్లీని వైభవ్ అధిగమిస్తాడు: డేల్ స్టెయిన్

అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు

Updated Date - Jun 12 , 2026 | 09:38 PM