Share News

కేన్ విలియమ్సన్ రిటైర్‌మెంట్‌పై కోహ్లీ భావోద్వేగ పోస్ట్

ABN , Publish Date - Jun 12 , 2026 | 07:41 PM

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ.. విలియమ్సన్ రిటైర్‌మెంట్‌పై స్పందించాడు. అతడికి శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు.

కేన్ విలియమ్సన్ రిటైర్‌మెంట్‌పై కోహ్లీ భావోద్వేగ పోస్ట్
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ అనూహ్య నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేసింది. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కేన్ మంచి స్నేహితులు. వీరిద్దరికీ అండర్ 19 రోజుల నుంచే పరిచయం. ఇప్పటికీ అదే స్నేహం కొనసాగుతోంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ.. విలియమ్సన్ రిటైర్‌మెంట్‌పై స్పందించాడు. అతడికి శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.


‘ప్రత్యర్థులుగా ప్రారంభమైన మన ప్రయాణం.. కాలక్రమేణా స్నేహంగా మారింది. ఎన్నో ఏళ్లుగా నీ ఆటను చూస్తూ.. నీతో పోటీ పడటం గొప్ప అనుభవంగా భావిస్తున్నాను. అంతకంటే ఎక్కువగా క్రికెట్‌తో పాటు వ్యక్తిగత జీవితంపై పంచుకున్న ఆలోచనలు విలువైనవిగా అనిపిస్తాయి. మనం కలిసి మాట్లాడుకున్న క్షణాలు నాకు ప్రత్యేక జ్ఞాపకంగా నిలుస్తాయి. నీ జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. క్రికెట్ కోసం నీ సర్వస్వాన్నే ధారపోశావు. ఇప్పుడు ఆ విజయాలను ఆస్వాదించే సమయం వచ్చింది. నీ జీవితం ఇప్పుడే మొదలైంది మిత్రమా..’ అంటూ కోహ్లీ ఎక్స్‌లో పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

సచిన్, కోహ్లీని వైభవ్ అధిగమిస్తాడు: డేల్ స్టెయిన్

అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు

Updated Date - Jun 12 , 2026 | 07:41 PM