Share News

లైకుల కోసం పిల్లల ప్రాణాలతో చెలగాటం.. వీడియో వైరల్

ABN , Publish Date - Feb 06 , 2026 | 08:47 PM

ఈ మధ్య చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చితో తమ ప్రాణాలే కాదు.. ఇతరుల ప్రాణాలూ రిస్క్ లో పెడుతున్నారు. ప్రస్తుతం అలాంటితే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లైకుల కోసం పిల్లల ప్రాణాలతో చెలగాటం.. వీడియో వైరల్
Social Media Reels

ఇంటర్నెట్ డెస్క్: కొంతమంది సోషల్ మీడియాలో తక్కువ సమయంలో ఎక్కువ ఫేమస్ కావాలని ప్రమాదకరమైన రీల్స్ చేస్తున్నారు. అలాంటి ఓ రీల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ మహిళ ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి బావి వద్ద ప్రమాదకరమైన స్థితిలో డ్యాన్స్ చేస్తూ వీడియో తీసింది. కొద్దిగా పట్టు తప్పినా ముగ్గురూ బావిలో పడిపోయే అవకాశం ఉన్నప్పటికీ, ఆమె లెక్క చేయకుండ రీల్స్ చేసింది. అందులో ఒక పిల్లాడికి గాయమైనా పట్టించుకోకుండా వీడియో తీసుకోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


‘పిల్లల ప్రాణాల కంటే నీకు లైకులే ముఖ్యమా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లైకుల పిచ్చిలో పడి పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ మహిళ నిలబడ్డ బావిలో నీరు ఉందా? లేక బావి పూడ్చి ఉందా? అన్న విషయంపై క్లారిటీ లేదు. ఒకవేళ నీరు ఉన్న బావి అయితే పిల్లల ప్రాణాలు రిస్క్ లో ఉన్నట్టే అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.


ఇవి కూడా చదవండి..

ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

Updated Date - Feb 06 , 2026 | 09:42 PM