వామ్మో.. ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ABN , Publish Date - Jun 10 , 2026 | 10:30 AM
సోషల్ మీడియాలో రోజూ ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ బాలుడి అద్భుతమైన టాలెంట్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి నదిలోకి కొబ్బరికాయను విసరగా.. ఒడ్డున ఉన్న ఒక బాలుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరైన సమయం, సరైన దూరాన్ని అంచనా వేసి వలను నదిలోకి విసిరాడు. కొన్ని క్షణాల్లోనే నదిలో వేగంగా కొట్టుకుపోతున్న ఆ కొబ్బరికాయను బాలుడు అత్యంత చాకచక్యంగా వలలో బంధించి పైకి లాగేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోను @skgupta_27అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ వయసులో నీకున్న తెలివితేటలు, ఏకాగ్రత చూస్తే మతిపోతుంది’ అని కొందరు, ‘అద్భుతమైన ప్రతిభ’ అని ఒక నెటిజన్, ‘ఇలాంటి టాలెంట్ ఉన్నవారు.. అక్కడే ఉండిపోతున్నారు’ అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఇది కేవలం నిరంతర సాధన వల్ల మాత్రమే సాధ్యమైంది’ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ డివిజన్ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?
బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..