ఈ కోతి ఏంటీ ఇలా చేసింది.. కుక్కపిల్లను చెట్టుపైకి ఎత్తుకెళ్లి మరీ..
ABN , Publish Date - Jun 10 , 2026 | 08:36 AM
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ కోతి కుక్క పిల్లను పట్టుకుని చెట్టు ఎక్కింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డు పక్కన తిరుగుతున్న ఒక కుక్కపిల్లను.. ఓ కోతి అకస్మాత్తుగా ఎత్తుకుని, సమీపంలోని పెద్ద చెట్టుపైకి ఎక్కింది. సుమారు 20 మేర పైకి ఎక్కి కొమ్మలపై కూర్చుంది. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంత ఎత్తు నుంచి కోతి ఎక్కడ ఆ కుక్కపిల్లను కింద పడేస్తుందోననే భయపడిపోయారు. కానీ, ఆ కోతి అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. కుక్కపిల్లకు ఎలాంటి హానీ తలపెట్టకపోగా.. దాన్ని తన ఒడిలోకి తీసుకుని ఎంతో ఆప్యాయంగా నిమిరింది.
కుక్కపిల్లను తన సొంత బిడ్డలా చూసుకుంటూ.. సుమారు 15 నిమిషాల పాటు ఆ చెట్టుపైనే గడిపింది. అనంతరం నెమ్మదిగా చెట్టు దిగి, ఆ కుక్కపిల్లను సురక్షితంగా నేలపై వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను కొందరు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వేప ఆకులే కాదు.. పండు కూడా ఔషధమే!
మేం రాలేం.. కావాలంటే క్యాబ్ బుక్ చేస్తాం!