గ్యాస్ సిలిండర్ ఎలా మారిందో చూడండి.. వైరల్ వీడియోను షేర్ చేసిన అఖిలేష్ యాదవ్..
ABN , Publish Date - Jun 08 , 2026 | 08:41 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. అలాగే, చాలా చోట్ల గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను షేర్ చేసి చర్చకు తెరతీశారు (LPG cylinder turns into stove).
ఆ వీడియోలో సాక్షి యాదవ్ అనే మహిళ ఖాళీ ఎల్పీజీ సిలిండర్‌ను పొయ్యిగా మార్చేసింది. గ్యాస్ సిలిండర్ అడుగు భాగంలో కత్తిరించి కర్రలతో మంట పెట్టి రొట్టెలు కాల్చుతోంది. దీనిని అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) 'అవసరమే సరికొత్త ఆవిష్కరణలకు మూలం' అని పేర్కొన్నారు. ఆ వీడియోలోని మహిళ తమ కుటుంబం ఎదుర్కొంటున్న గ్యాస్ కష్టాల గురించి మాట్లాడింది. ప్రస్తుతం ఒక గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటిపోయిందని పేర్కొంది.
తమది ఉమ్మడి కుటుంబం కావడంతో ఒక్క గ్యాస్ సిలిండర్ సరిపోవడం లేదని, అందుకే ఇలా కట్టెలతో ఇంట్లోనే వంట చేసుకుంటున్నామని తెలిపింది (woman cooks on empty cylinder). పిల్లలకు వంట చేసేందుకు గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ఒక్కోసారి చిప్స్‌తోనే వారి కడుపు నింపుతున్నామని పేర్కొంది. ఈ వీడియోను షేర్ చేసిన అఖిలేష్ యాదవ్, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, గృహ వినియోగ ఖర్చుల పెరుగుదల గురించి కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..
ఇరాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు సూచన..