ఇజ్రాయెల్‌పై దాడుల నిలిపివేత.. లెబనాన్‌పై దాడులు చేస్తే మాత్రం..: ఇరాన్
ABN , Publish Date - Jun 08 , 2026 | 07:35 PM
పశ్చిమాసియాలో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌పై చేపట్టిన తాజా సైనిక చర్యలను ముగిస్తున్నట్లు ప్రకటించింది.
పశ్చిమాసియాలో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌పై చేపట్టిన తాజా సైనిక చర్యలను ముగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే మాత్రం మరింత తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని హెచ్చరించింది. ఇటీవల బీరుట్ సమీపంలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణి దాడులు చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి (Iran Israel conflict).
ఇజ్రాయెల్‌పై దాడి వెనకున్న తమ లక్ష్యాలు నెరవేరాయని, ప్రస్తుత దశలో సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఇకపై, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే, తమ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. సోమవారం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ ప్రయోగించిన పలు డ్రోన్‌లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చేశాయని పేర్కొంది (Iran warning Israel).
ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులకు దిగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు (Donald Trump ceasefire). ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, శాంతి సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు. దాడులు ఆపి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయి.
ఇవి కూడా చదవండి..
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..
ఇరాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు సూచన..