హోర్ముజ్ సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి.. సాయం కోసం మెసేజ్
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:31 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, భారతీయులు ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌక దాడికి గురైనట్టు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగినట్టు సమాచారం.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, భారతీయులు ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌక దాడికి గురైనట్టు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరగ్గా.. ఆ సమయంలో నౌకలో 24 మంది భారతీయులున్నారని సమాచారం. దీంతో అత్యవసర సహాయం కోసం నౌకలోని సిబ్బంది అభ్యర్థించినట్టు(SOS) వార్తలు వస్తున్నాయి (Indian cargo vessel attack).
పలావు దేశ జెండాతో వెళ్తున్న నౌక ఒమన్ తీరానికి దగ్గర్లో ఉన్న సమయంలో ఈ దాడి జరినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆ నౌకలో 24 మంది భారతీయులున్నట్టు సమాచారం. ఈ దాడి కారణంగా నౌక ఇంజిన్ దెబ్బతిందని, నౌకకు రంధ్రం పడిందని, దాంతో సిబ్బంది ఎస్‌ఓఎస్ కాల్ పంపినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దాడి కారణంగా నౌకలోని లైఫ్ బోట్లు కూడా దెబ్బతిన్నట్టు సమాచారం ( Strait of Hormuz Indian sailors).
దాడి కారణంగా ఆ ఓడలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది (Hormuz crisis). లైఫ్‌బోట్లు కూడా దెబ్బతినడంతో తరలింపు ప్రక్రియ సంక్లిష్టంగా మారినట్టు సమాచారం. కాగా, నౌకపై క్షిపణులు లేదా డ్రోన్‌లతో దాడి జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ దాడికి బాధ్యులు ఎవరనే విషయంలో స్పష్టత లేదు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..
ఇరాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు సూచన..