ఇరాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు సూచన..
ABN , Publish Date - Jun 08 , 2026 | 02:45 PM
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది.
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌కు వెళ్లాలనుకుంటున్న భారతీయులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ప్రస్తుతం అక్కడ ఉన్నవారు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని సూచించింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి (Iran travel warning).
'ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, వ్యాపారులు, యాత్రికులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలి. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను విడిచి వెళ్లాలి. అవసరమైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి' అని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది (Indian Embassy Tehran).
ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి (Israel Iran tensions). లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతికారంగా ఇరాన్ రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. దీంతో ఇరాన్‌లోని మషహర్ పెట్రో కెమికల్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. తమ దాడుల్లో పెట్రో కెమికల్ ప్లాంట్ తీవ్రంగా ధ్వంసమైనట్టు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
డొమినికన్ రిపబ్లిక్ విమానాశ్రయంలో కుప్పకూలిన జెట్.. ఇద్దరి మృతి
భారీ భూకంపం.. ఫిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలు జారీ