Share News

లక్షల్లో జీతం.. అయినా వీకెండ్లలో రాపిడో డ్రైవర్‌గా పని.. బెంగళూరు టెకీ కథ వైరల్..

ABN , Publish Date - Jun 08 , 2026 | 04:59 PM

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడు ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తూ లక్షల్లో జీతం పొందుతున్నాడు. అయినప్పటికీ, శని, ఆదివారాల్లో బైక్ టాక్సీ సేవలు అందిస్తున్నాడు.

లక్షల్లో జీతం.. అయినా వీకెండ్లలో రాపిడో డ్రైవర్‌గా పని.. బెంగళూరు టెకీ కథ వైరల్..
Bengaluru software engineer

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడు ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తూ లక్షల్లో జీతం పొందుతున్నాడు. అయినప్పటికీ, శని, ఆదివారాల్లో బైక్ టాక్సీ సేవలు అందిస్తున్నాడు. లక్షల్లో జీతం సంపాదిస్తున్నా బెంగళూరులో జీవన వ్యయం తట్టుకోలేకే అతడు బైక్ ట్యాక్సీ రైడర్‌గా మారాడు. షాబాజ్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు. (Bengaluru software engineer).


షాబాజ్ ఇటీవల బెంగళూరులో బన్నేర్‌ఘట్టకు వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకున్నారు. ఆ రాపిడో డ్రైవర్, షాబాజ్‌తో అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడారు. దీంతో ఆశ్చర్యపోయిన షాబాజ్ ఆ డ్రైవర్ గురించి ఆరా తీశారు. ఆ 35 ఏళ్ల వ్యక్తి ఓ ప్రముఖ టెక్ సంస్థలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పని చేస్తున్నట్టు, ఆరంకెల జీతం పొందుతున్నట్టు చెప్పారు. 'నాకు పెళ్లైంది. ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. కుటుంబాన్ని పోషించడానికి అదనపు ఆదాయం కోసం వారాంతాల్లో రాపిడో నడుపుతాను' అని ఆ రైడర్ చెప్పడంతో షాబాజ్ షాకయ్యారు (Weekend Rapido rider).


మంచి జీతాలు తీసుకునే టెక్ నిపుణులు కూడా బెంగళూరు, ఇతర ప్రధాన నగరాల్లోని జీవన వ్యయాలను భరించడానికి ఇబ్బంది పడుతున్నారేమోనని తనకు సందేహం కలిగిందని షాబాజ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు (viral news). ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో ఇలా రెండు ఉద్యోగాలు చేస్తే తప్ప బతకడం కష్టమని చాలా మంది కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..


ఇరాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు సూచన..

Updated Date - Jun 08 , 2026 | 06:10 PM