మళ్లీ మొదలైన దాడులు.. భారీ నష్టాల్లో దేశీయ సూచీలు..
ABN , Publish Date - Jun 08 , 2026 | 03:57 PM
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు దేశీయ సూచీలకు నష్టాలను మిగిల్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు మొదలైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు దేశీయ సూచీలకు నష్టాలను మిగిల్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు మొదలైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.70) భారీగా పడిపోయింది. అలాగే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 4.5 శాతం పెరిగి 97.16 డాలర్లకు చేరుకుంది. ఇక, శుక్రవారం విదేశీ మదుపర్లు రూ. 8776 కోట్లు విలువైన షేర్లను అమ్మేశారు. ఇన్ని ప్రతికూలతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (74,243)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 800 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. చివరకు సెన్సెక్స్ 719 పాయింట్ల నష్టంతో 73,524 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 243 పాయింట్ల నష్టంతో 23,123 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో మ్యాక్స్ హెల్త్‌కేర్, ఫోర్టిస్ హెల్త్, ఆల్కెమ్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). విప్రో, వెర్నోవా టీడీ, ముత్తూట్ ఫైనాన్స్, ఫోర్స్ మోటార్స్, నిప్పాన్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 432 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 849 పాయింట్లు నష్టపోయింది.
ఇవి కూడా చదవండి..
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..
ఇరాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు సూచన..