Share News

భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 08 , 2026 | 03:20 PM

భారతదేశం తన అణ్వాయుధాల నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. ప్రస్తుతం భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నాయి. భారత్ గతేడాది 180 అణ్వాయుధాలను కలిగి ఉండగా, ఈ ఏడాది మరో పదింటిని జోడించి 190కు చేరుకుంది.

భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..
India nuclear arsenal

భారతదేశం తన అణ్వాయుధాల నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. ప్రస్తుతం భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నాయి. భారత్ గతేడాది 180 అణ్వాయుధాలను కలిగి ఉండగా, ఈ ఏడాది మరో పదింటిని జోడించింది. మరోవైపు అణ్వాయుధాల విషయంలో భారత్ కంటే పాకిస్థాన్ వెనుకబడి ఉంది. ప్రస్తుతం పాక్ వద్ద 170 అణ్వాయుధాలు ఉన్నాయి. పాక్ కంటే భారత్ దగ్గర 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి (India nuclear arsenal).


స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) తాజాగా ఈ గణాంకాలను వెల్లడించింది. భారత్ ప్రస్తుతం దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధి, సముద్ర ఆధారిత అణు నిరోధక సామర్థ్యాల విస్తరణ, ఆధునిక డెలివరీ వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా అగ్ని-వి, కొత్త తరం క్షిపణి వ్యవస్థలు భారత వ్యూహాత్మక బలాన్ని పెంచుతున్నాయని సిప్రీ పేర్కొంది (India Pakistan nuclear weapons).


ఇక, ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలుగా రష్యా (5420), అమెరికా (5042) తొలి రెండు స్థానాల్లో నిలిచాయని సిప్రీ వెల్లడించింది (SIPRI Yearbook 2026). ఆ తర్వాతి స్థానంలో చైనా (620) ఉంది. ఇక, ఆ తర్వాత ఫ్రాన్స్ (370), బ్రిటన్ (225), ఇజ్రాయెల్ (90), ఉత్తరకొరియా (60) దేశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశాలు 9 ఉన్నాయి. ఈ 9 దేశాల వద్ద మొత్తం 12 వేలకు పైగా అణ్వాయుధాలున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

డొమినికన్ రిపబ్లిక్‌ విమానాశ్రయంలో కుప్పకూలిన జెట్.. ఇద్దరి మృతి

భారీ భూకంపం.. ఫిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలు జారీ

Updated Date - Jun 08 , 2026 | 03:28 PM