Share News

వ్యూస్ కోసం ఇలా ఎవరూ చేయొద్దు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Jul 24 , 2026 | 03:24 PM

వర్షాకాలంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదుల్లోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఉత్తరాఖండ్ పోలీసులు హెచ్చరించారు. వైరల్ వీడియోను ఉదాహరణగా చూపిస్తూ ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేశారు..

వ్యూస్ కోసం ఇలా ఎవరూ చేయొద్దు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Uttarakhand Police

ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదుల్లోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఉత్తరాఖండ్ పోలీసులు హెచ్చరించారు. ఇటీవల చాలా మంది యువత.. సోషల్ మీడియాలో తక్కువ సమయంలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉప్పొంగి ప్రవహిస్తున్న నది మధ్యలో ముగ్గురు ప్రమాదకంరగా ఈదడం వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై స్పందించిన ఉత్తరాఖండ్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. వర్షాకాలంలో నదుల ప్రవాహం ఎప్పుడు ఎలా మారుతుందో అంచనా వేయడం కష్టమని, నీటి అడుగున దాగి ఉన్న బలమైన ప్రవాహాలు, జారిపోయే రాళ్లు, అకస్మాత్తుగా పెరిగే నీటిమట్టాలు ప్రాణాంతక పరిస్థితులను సృష్టించవచ్చని తెలిపారు. కేవలం వినోదం కోసం ఇలాంటి ప్రమాదకర సాహసాలకు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు లేదా ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనిపిస్తే వెంటనే 112కు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు తమ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుతమైన ప్రవర్తనే ప్రాణాలను కాపాడగలదని పోలీసులు మరోసారి గుర్తు చేశారు.


ఇవి కూడా చదవండి...

జనసేనకు పత్రికలు, ఛానళ్లు లేవు.. కార్యకర్తలే మీడియా: మంత్రి నాదెండ్ల మనోహర్

విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 04:04 PM