Share News

మలుపు వద్ద ఘోర ప్రమాదం.. వీడియో వైరల్

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:04 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను షాక్‌కు గురిచేసే రోడ్డు ప్రమాద వీడియో వైరల్‌గా మారింది. రోడ్లపై టర్నింగ్ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది.

మలుపు వద్ద ఘోర ప్రమాదం.. వీడియో వైరల్
Viral Bike Accident Video

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను షాక్‌కు గురిచేసే రోడ్డు ప్రమాద వీడియో వైరల్‌గా మారింది. రోడ్లపై టర్నింగ్ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ దృశ్యం చూస్తే అర్థమవుతుంది. ఘాట్ రోడ్లు ఎప్పుడూ ఇరుగ్గా, ప్రమాదకరమైన మలుపులతో ఉంటాయి. ఇలాంటి చోట్ల వాహనాల వేగాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ, కొందరు అతివేగంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.


సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంటికి అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. రోడ్డు ఖాళీగా, ప్రశాంతంగా ఉంటుంది. అయితే, కొన్ని క్షణాల్లోనే ఒక బైక్ అతివేగంగా దూసుకురావడం కనిపిస్తుంది. ఆ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ముందుకు రాగానే తీవ్రమైన మలుపు ఉంది. సాధారణంగా ఇలాంటి మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు కాబట్టి వేగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. కానీ, సదరు బైక్ నడుపుతున్న వ్యక్తి మలుపు వద్దకు వచ్చినా కూడా వేగాన్ని అస్సలు తగ్గించలేదు.

అతివేగం కారణంగా మలుపు తిరిగే క్రమంలో బైక్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో బైక్ పైనుంచి ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై బలంగా పడిపోయారు. ఆ ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, బైక్ కిందపడిపోయాక కూడా ఆ ఇద్దరూ రోడ్డుపై చాలా దూరం వెళ్లి పడ్డారు. కేవలం ఒక్క క్షణం అజాగ్రత్త, అతివేగం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగింది. వాహనం నడిపేటప్పుడు వేగం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ఈ ప్రమాద దృశ్యాలు ఒక హెచ్చరిక లాంటివని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఇవీ చదవండి:

'మీరు నిశ్శబ్దంగా ఉండండి'.. ఐరాస అధికారిపై ఇజ్రాయెల్ దౌత్యవేత్త ఆగ్రహం

‘నేనే బాస్’ కామెంట్‌పై క్లారిటీ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

Updated Date - Jun 20 , 2026 | 02:00 PM