Share News

డబ్బులు మడతపెడుతున్నారా.. ఓసారి ఈ ట్రిక్ ట్రై చేసి చూడండి..

ABN , Publish Date - Jun 20 , 2026 | 09:17 AM

సోషల్ మీడియాలో ప్రస్తుతం కరెన్సీ నోట్లపై చేసిన ప్రయోగానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

డబ్బులు మడతపెడుతున్నారా.. ఓసారి ఈ ట్రిక్ ట్రై చేసి చూడండి..
500 Rupee Note Trick

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం కరెన్సీ నోట్లపై చేసిన ప్రయోగానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. సాధారణంగా సోషల్ మీడియాలో రోజూ ఎన్నో కొత్త కొత్త ట్రిక్స్, చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న నోట్ల లెక్కింపు వీడియో కూడా అలాంటిదే. ఇందులో ఒక వ్యక్తి ఐదు వందల నోట్లను వినూత్నంగా లెక్కించే విధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.


సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో.. ఓ వ్యక్తి రూ. 500 నోట్ల కట్టను చేతిలో పట్టుకుని కనిపిస్తాడు. ఆ తర్వాత అతను ఆ బండిల్ నుంచి ఒక నోటును తీసి, మిగిలిన నోట్లపై ఒక ప్రత్యేక పద్ధతిలో మడతపెడతాడు. అనంతరం తన బొటనవేలు, మిగిలిన వేళ్ల సహాయంతో నోట్లను నెమ్మదిగా ముందుకు జరుపుతూ లోపలి వైపు చక్కగా సెట్ చేస్తాడు. కేవలం కొన్ని సెకన్లలోనే ఆ మొత్తం నోట్ల కట్ట, మడతపెట్టిన ఆ ఒక్క నోటు ఆధారంగా ఒకదానికొకటి ముడిపడిపోయినట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత అతను తన ట్రిక్ చూపిస్తూ నోట్లను ఒక్కొక్కటిగా సులువుగా బయటకు తీస్తూ లెక్కిస్తాడు. ఈ పద్ధతి వల్ల నోట్లు త్వరగా విడిపోతాయని, లెక్కించడం సులువవుతుందని ఈ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం!

40 ఏళ్ల తర్వాత..

Updated Date - Jun 20 , 2026 | 10:43 AM