Share News

వ్యూస్ కోసం అమాయకుల ప్రాణాలతో చెలగాటం.. ఇదో చెత్త ట్రెండ్..

ABN , Publish Date - Jun 20 , 2026 | 07:28 AM

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని, భారీగా వ్యూస్ తెచ్చుకోవాలని కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రాంక్‌ల పేరుతో అభంశుభం తెలియని వారిని గాయాలపాలు చేస్తున్నారు.

వ్యూస్ కోసం అమాయకుల ప్రాణాలతో చెలగాటం.. ఇదో చెత్త ట్రెండ్..
Kolkata influencer

ఇంటర్‌నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని, భారీగా వ్యూస్ తెచ్చుకోవాలని కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రాంక్‌ల పేరుతో అభంశుభం తెలియని వారిని గాయాలపాలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ప్రాంక్ ట్రెండ్ నడుస్తోంది. ఆ ప్రాంక్ బారిన పడిన జనం గాయాలపాలవుతున్నారు. వారి శరీరాలు కాలుతున్నాయి. ఇంతకీ ఆ ప్రాంక్ ఏంటంటే.. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు హారతి పల్లెంతో వీధుల్లో తిరుగుతున్నారు. వీధుల్లో వెళ్లే వారిని హారతి తీసుకోమని అడుగుతున్నారు.


హారతి తీసుకునే ముందు చేతులు కడుక్కోమని వారి చేతులపై ఓ లిక్విడ్ పోస్తున్నారు. వాళ్లు ఆ లిక్విడ్‌తో చేతులు కడుక్కుని హారతి తీసుకోగానే.. భగ్గున చేతులకు మంటలు అంటుకుంటున్నాయి. అది కూడా చాలా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రాంక్ కారణంగా చాలా మంది చేతులు కాలిపోయాయి. కొంతమంది ముఖాలు, వెంట్రుకలు కూడా కాలిపోయాయి. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ను చూసుకుని మరొక ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ ప్రాంక్‌ను అమాయక జనంపై చేస్తున్నారు. ఆఖరికి అమ్మాయిలు కూడా ఈ ప్రాంక్‌ను చేయటం గమనార్హం.


హారతి ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై జనం మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఈ ప్రాంక్ చేసే వారికి మద్దతుగా నిలుస్తుంటే.. మరి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాంకులు చేసే వారిని ఊరికే వదిలిపెట్టకూడదు. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’..‘ఇది చాలా దారుణం. ఈ ప్రాంక్ చేసే వారిని పోలీసులు అరెస్ట్ చేయాలి’..‘ఈ ప్రాంక్‌లో అంత డేంజర్ ఏముంది.. ఏదో సరదా కోసం చేసింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్

హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫిర్యాదు.. ముగ్గురి అరెస్ట్..

Updated Date - Jun 20 , 2026 | 07:36 AM