Share News

పంజాబ్‌లో దారుణం.. వీల్‌చైర్‌లో ఉన్న వ్యక్తి నగదు దోపిడి.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:36 PM

పట్టపగలు, జనసంచారం ఉన్న ప్రాంతంలో.. వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిని దొంగలు టార్గెట్ చేశారు. బైకుపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. పర్సు లాక్కొని పరారైన ఘటన జిరక్‌పూర్‌లో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పంజాబ్‌లో దారుణం.. వీల్‌చైర్‌లో ఉన్న వ్యక్తి నగదు దోపిడి.. వీడియో వైరల్
Wheelchair Man Robbery

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లోని జిరక్‌పూర్‌లో పట్టపగలు జరిగిన దోపిడీ ఘటన కలకలం రేపింది. పాలం ఎన్‌క్లేవ్ ప్రాంతంలో వీల్‌చైర్‌లో తన ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్తున్న సురేంద్ర పాల్‌ను ఇద్దరు గుర్తుతెలియని యువకులు టార్గెట్ చేశారు. బుధవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో బైకుపై వచ్చిన నిందితులు.. పాల్ వద్ద ఉన్న పర్సును లాక్కొని, అక్కడి నుంచి పరారైనట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్సులో సుమారు రూ.5 వేల నగదు, మొబైల్ ఫోన్, క్రెడిట్ కార్డులు, పాన్ కార్డు తదితరాలతో పాటు ఇతర ముఖ్యమైన వస్తువులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్లు తెలుస్తోంది. ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘వికలాంగుడు అన్న కనికరం లేకుండా చోరీకి పాల్పడ్డారు.. వీళ్లు మనుషులేనా?’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఇలాంటి వాళ్లను దారుణంగా శిక్షించాలి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పాము విషానికి కొత్త విరుగుడు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 02:02 PM