Share News

2,000 కి.మీ దూరం ప్రయాణించిన పావురం

ABN , Publish Date - May 07 , 2026 | 12:47 PM

తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలోని ‘రాయల్‌ రేసింగ్‌ పీజియన్‌ క్లబ్‌ ఆఫ్‌ దిశయన్‌విలై’ ఆధ్వర్యంలో లక్నో నుంచి తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి వరకు సుమారు 2,000 కి.మీ దూరం పావురాళ్ల పోటీ నిర్వహించారు.

2,000 కి.మీ దూరం ప్రయాణించిన పావురం
Pigeon, Chennai

చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలోని ‘రాయల్‌ రేసింగ్‌ పీజియన్‌ క్లబ్‌ ఆఫ్‌ దిశయన్‌విలై’ ఆధ్వర్యంలో లక్నో నుంచి తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి వరకు సుమారు 2,000 కి.మీ దూరం పావురాళ్ల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియాకుమారి, విరుదునగర్‌, మదురై, రామనాథపురం తదితర జిల్లాలకు చెందిన 17 పావురాలు పాల్గొన్నాయి.


గత నెల 2వ తేది నుంచి లక్నో నుంచి ఈ పోటీ ప్రారంభమైంది. ఈ పోటీలో పాల్గొన్న సయ్యద్‌ అహ్మద్‌ ఇబ్రహీంకు చెందిన ‘యూసఫ్‌’ అనే పావురం 31 రోజులు సుమారు 2,000 కి.మీ ప్రయాణించి కోవిల్‌పట్టి చేరుకుంది. విజేత పావురం యజమానికి బహుమతి, ప్రశంసాపత్రాన్ని నిర్వాహకులు అందజేసి అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కిలో వంజరం చేపలు రూ.1,500

పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏర్పాటు..

Read Latest Telangana News and National News

Updated Date - May 07 , 2026 | 12:47 PM