Share News

తొమ్మిది మందితో బైక్ రైడ్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ABN , Publish Date - Jul 08 , 2026 | 10:54 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల విచిత్రమైన, షాకింగ్ వీడియోలు మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని వీడియోలు ఎంతో ఆకర్షిస్తూ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి..

తొమ్మిది మందితో బైక్ రైడ్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Nine People on One Bike

ఇంటర్నెట్ డెస్క్: ఓ బైక్‌పై ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మంది ప్రయాణిస్తున్నవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఇలాంటి సాహసం ఎలా చేయగలిగారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు చూస్తుంటాం. జనాలు వాటిని తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ బైక్ వీడియో కూడా అలాంటి కోవకే చెందుతుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చట్టప్రకారం ద్విచక్ర వాహనంపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. కానీ చాలా మంది నిబంధనలను ఉల్లంఘిస్తూ ముగ్గురు, నలుగురు వెళ్లడం చూస్తూనే ఉంటాం. అయితే.. ఈ వీడియోలో మాత్రం ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా, వెనుక సీటులో ఒక మహిళ కూర్చుని ఉంది. వారిద్దరి మధ్యలో ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. ఇరువైపులా మరో ఐదుగురు పిల్లలను వేలాడదీసి పట్టుకున్నారు. బైక్‌పై మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బండి నడుపుతున్న వ్యక్తికి సీటులో అసలు చోటే లేదు. అతను బైక్ ట్యాంక్‌పై హ్యాండిల్ ఆనుకుని కూర్చుని మరీ డ్రైవ్ చేస్తున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ, సోషల్ మీడియాలోని కొన్ని పోస్టుల ప్రకారం ఇది పాకిస్తాన్‌కు చెందిన వీడియోగా ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రం‌లో గాలింపు..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 08 , 2026 | 11:03 AM