ముంబైలో షాకింగ్ ఘటన.. వర్షంలో విద్యార్థినులకు కరెంట్ షాక్.. చివరికి..
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:24 PM
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని నవీ ముంబై ప్రాంతం అస్తవ్యస్థంగా మారింది. ఈ క్రమంలో నెరూల్‌లోని ఎల్పీ బ్రిడ్జి సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని నవీ ముంబై ప్రాంతం అస్తవ్యస్థంగా మారింది. ఈ క్రమంలో నెరూల్‌లోని ఎల్పీ బ్రిడ్జి సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు విద్యార్థినులు విద్యుదాఘాతానికి గురయ్యారు. స్థానికుల సమాచారం ప్రకారం.. ఎల్పీ బ్రిడ్జి కింద ఉన్న ప్రాంతంలో కరెంట్ వైర్లలో లోపం కారణంగా నీటిలో విద్యుత్ ప్రవహించింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులు అనుకోకుండా ఆ నీటిని తాకడంతో షాక్‌కు గురయ్యారు.
అక్కడే ఉన్న ఒక వ్యక్తి సాహసంతో చెట్టు కొమ్మ సహాయంతో.. వారికి విద్యుత్ షాక్ తగలకుండా చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితులను వెంటనే సమీపంలోని డీవై పాటిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
గాదె సాయికృష్ణ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
క్రిప్టోతో భారీ ఆదాయం.. గతేడాది ట్రంప్ సంపాదన రూ.11 వేల కోట్లకు పైనే..!
Read Latest AP News And Telugu News