రైలు కోచ్‌ను చెత్తకుండీగా మార్చిన మహిళ.. వీడియో వైరల్
ABN , Publish Date - Jun 30 , 2026 | 03:17 PM
రైల్లో ఓ మహిళ చేసిన పని సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కోచ్‌లోనే చెత్త వేయడంతో పాటు సీటు పక్కనే చేతులు కడుక్కోవడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రైల్లో ఓ మహిళ ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ ఆహార వ్యర్థాలను తన సీటు వద్దే కింద పడేయడంతో పాటూ అక్కడే వాటర్ బాటిల్‌తో చేతులు కడుక్కుంటోంది. రైలు కోచ్‌లో ఇందుకోసం ప్రత్యేకంగా వాష్ బేసిన్‌లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా సీటు వద్దే ఇలా చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ డోర్‌కు సమీపంలో ఉన్న సీటులో కూర్చొని ఉన్నప్పటికీ.. కొద్ది దూరంలో ఉన్న వాష్ ఏరియాకు వెళ్లకుండా సీటు వద్దే చేతులు కడుక్కోవడం, ఆహార వ్యర్థాలను అక్కడే వదిలేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా వ్యవహరించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియో ఏ రైలులో చిత్రీకరించబడింది, ఎప్పుడు జరిగింది, ఏ మార్గంలో ప్రయాణిస్తున్న రైలు అనే వివరాలు ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడికాలేదు. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
ఇది జెన్ జీతోనే సాధ్యం.. ముందు తరాలకు అంత సీన్ లేదు.. వైరల్ పోస్టు
ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటన.. విక్టోరియాలో ఘన స్వాగతం..