ఇది జెన్ జీతోనే సాధ్యం.. ముందు తరాలకు అంత సీన్ లేదు.. వైరల్ పోస్టు
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:59 PM
ఆఫీసుల్లో విషపూరిత పని సంస్కృతికి చెక్ పెట్టగలిగే ధైర్యం జెన్ జీ తరానికే ఉందంటూ ఒక మహిళ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పని ప్రదేశాల్లో విషపూరిత సంస్కృతికి చెక్ పెట్టేది జెన్ జీనేనని ఒక వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. జెన్ జీ ముందు తరమైన మిలీనియల్స్‌కు అంత ధైర్యం లేదని కూడా ఆ నెటిజన్ కామెంట్ చేశారు. ఇది ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది.
షీతల్ అనే మహిళ ఈ పోస్టును నెట్టింట పంచుకున్నారు. జెన్ జీ తరానికి చెందిన తన బంధువు చేసిన పనిని జనాలతో షేర్ చేశారు. ‘పని ప్రదేశాల్లో విషపూరిత సంస్కృతికి చెక్ పెట్టగలిగేది జెన్ జీనే అని అనుకుంటున్నాను. మా జెన్ జీ కజిన్‌తో ద్వారా ఇటీవల నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఇటీవల ఒక రోజు వాళ్ల ఆఫీసులో ఏసీ పనిచేయకపోతే ఉద్యోగులంతా క్యాటీన్‌లోకి వెళ్లారట. ఏసీ రిపేర్ అయ్యాకే వస్తామని అన్నారట. షిఫ్ట్ అయిపోగానే వారంతా ఒకేసారి ఇళ్లకు వెళ్లిపోతారట’
‘మేనేజర్ మెప్పు పొందేందుకు ఎవరూ అతిగా పనిచేయరట. ఎవరైనా తమతో తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే హెచ్‌ఆర్‌కు చెబుతారట. హెచ్‌ఆర్ కూడా జెన్‌జీకే మద్దతు తెలుపుతారట. వాళ్ల గ్రూపులో మిలినీయల్స్ ఎవరూ లేరట. మిలీనియల్స్‌కు అంత ధైర్యం ఉండదని మా కజిన్ చెప్పింది. మీరు అన్నింటిని భరించడానికి అలవాటు పడ్డారని నన్ను ఉద్దేశించి కామెంట్ చేసింది’ అని ఆమె చెప్పారు.
ఈ పోస్టుకు జనాల నుంచి సహజంగానే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. జీతాలు పెంచాల్సిన సమయంలో ఈ ఐకమత్యం మాయమై ఎవరో ఒకరు హ్యాండిస్తారని కొందరు హెచ్చరించారు. మిలీనియల్స్ నెత్తిన అప్పుల భారం, బాధ్యతలు ఉంటాయని, వారు తిరగబడే స్థితిలో లేరని మరికొందరు అన్నారు. మిలీనియల్స్ సంధి కాలంలో ఉన్నారని, యువతకు ఉండే స్వేచ్ఛ, అవకాశాలు వారికి ఉండవని మరికొందరు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 35-45 మధ్య ఉన్న వారిని మిలీనియల్స్‌గా పిలుస్తున్న విషయం తెలిసిందే. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిని జెన్ జీగా పిలుస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఒక్క రూపాయికే బ్రాండెడ్ డ్రెస్సులు.. మాల్ దగ్గరికి క్యూకట్టిన జనం..
ఐస్‌క్రీమ్ కోసం బాల్కనీ నుంచి వేలాడిన వ్యక్తి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్