రైలు తలుపునకు వేలాడుతూ ప్రయాణికుడి ప్రమాదకర ప్రయాణం.. వీడియో వైరల్
ABN , Publish Date - Feb 12 , 2026 | 05:49 PM
ముంబై లోకల్ రైళ్లలో ఎంతో రద్దీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉదయం 8-10 గంటలు, సాయంత్రం 5-8 గంటల మధ్య కిక్కిరిసిన బోగీలలో ప్రయాణం నరకం, నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే.. ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణం ఒక సాహసమే అంటారు. ఓ వ్యక్తి ప్రమాదపు అంచుల్లో ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ముంబై లోకల్ రైళ్ల(Mumbai local trains)లో ఎంతో రద్దీ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయినా కూడా తమ గమ్య స్థానానికి చేరుకోవడానికి పోటీ పడుతూ ప్రయాణిస్తుంటారు. గురువారం సోషల్ మీడియాలో ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్ అవుతోంది. రైలు లోపల కనీసం కాలు పెట్టేందుకు కూడా చోటు లేకపోవడంతో, ఒక వ్యక్తి కేవలం తలుపు హ్యాండిల్ పట్టుకొని గాలిలో వేలాడుతూ ప్రయాణం కొనసాగించాడు. అతని కాళ్లు రైలు బోగీ మెట్లపై కూడా సరిగ్గా లేవు. రైలు వేగానికి అతను ఎక్కడ కింద పడిపోతాడో అని తోటి ప్రయాణికులే కాదు, వీడియో చూస్తున్న వీక్షకులు కూడా ఆందోళన చెందారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో @Whoiamyours అనే యూజర్ ద్వారా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘నేను అర్జంట్‌గా ఆఫీస్‌కి వెళ్లాలి’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘మీ కుటుంబానికి ఒక వ్యక్తి అవసరం అన్న విషయం మరిచారా?’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. వైరల్ అవుతోన్న ఈ వీడియోపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. ‘ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు ప్రాణాంతకం, గమ్యస్థనానికి చేరుకోవడం ఆలస్యమైనా పరవాలేదు, ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణాలు చేయొద్దు’ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్‌పై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత..
జల్లికట్టులో తీవ్ర విషాదం.. యువకుడి మృతి.. 26 మందికి గాయాలు..