కొండల మధ్య మ్యాగీ స్టాల్.. ఒక్కరోజే భారీ ఆదాయం! ఎంతో తెలిస్తే షాక్
ABN , Publish Date - May 14 , 2026 | 12:22 PM
పర్వత ప్రాంతాల్లో పర్యటించే పర్యాటకులకు, చలిలో వేడివేడి మ్యాగీ తినడం అంటే ఒక మధురమైన అనుభవం. ఈ క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుంటే ఎంత లాభం వస్తుందో తెలుసుకోవాలని ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ దేవాన్ష్ త్యాగి వినూత్న ప్రయోగం చేశారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: పర్వత ప్రాంతాల్లో పర్యటించే పర్యాటకులకు, చలిలో వేడివేడి మ్యాగీ తినడం అంటే ఒక మధురమైన అనుభవం. ఈ క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుంటే ఎంత లాభం వస్తుందో తెలుసుకోవాలని ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ దేవాన్ష్ త్యాగి వినూత్న ప్రయోగం చేశారు. దేవాన్ష్ త్యాగి అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, కొండ ప్రాంతాల్లో ఒక రోజు మ్యాగీ స్టాల్ పెడితే ఎంత ఆదాయం వస్తుందో చూడాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా, నీటి వనరులు ఉన్న కొండ ప్రాంతంలో తాత్కాలిక మ్యాగీ స్టాల్ పెట్టి వ్యాపార ప్రయోగం చేశాడు. ఒక్కరోజు వేలల్లో సంపాదించవచ్చని నిరూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రయోగం కోసం దేవాన్ష్ ఒక సుందరమైన పర్యాటక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అక్కడ పర్యాటకులను ఆకర్షించేలా ఒక తాత్కాలిక మ్యాగీ స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. కస్టమర్లు కూర్చోవడానికి ప్లాస్టిక్ కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేశాడు. ప్రకృతి ఒడిలో వేడివేడి మ్యాగీని ఆస్వాదించేందుకు పర్యాటకులు ఎగబడ్డారు. రోజు ముగిసే సమయానికి స్టాక్ మొత్తం అయిపోయింది. మ్యాగీ ప్లేటును రూ.100కి, బటర్ మ్యాగీని రూ.120కి విక్రయించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ వ్యాపార ప్రయోగం ముగిసేసరికి అతను ఏకంగా రూ. 24,000 సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
దేవాన్ష్ త్యాగి.. ఈ పూర్తి ఉదంతాన్ని వీడియోగా తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కేవలం ఒక్క రోజులోనే అంత పెద్ద మొత్తంలో సంపాదించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ‘ఇది నిజంగా అద్భుతమైన ఐడియా’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు దేవాన్ష్ మ్యాగీ వండటానికి దగ్గరోలోని వాగు నుంచి నీటిని తీసుకోవడం పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రత పరంగా ఇలా చేయడం సరికాదు అని అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
రక్తపోటు నుంచి బరువు వరకు.. మందార టీతో ఎన్నో లాభాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News