ప్రాణాలతో చెలగాటం అంటే ఇదే.. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! వీడియో వైరల్
ABN , Publish Date - Jun 13 , 2026 | 09:10 AM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైలు ఎక్కడం చూసి జనం మండిపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయిస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి, కానీ కొన్ని వీడియోలు మాత్రం చూసేవారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఒక వీడియో కూడా అలాంటిదే. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైలు ఎక్కడం చూసి జనం మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై కొందరు ప్రయాణికులు నిలబడి ఉన్నారు. అప్పటికే ప్లాట్‌ఫారమ్ నుంచి రైలు కదలడం ప్రారంభించింది. ఆ సమయంలో ఒక వ్యక్తి వేగంగా కదులుతున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించాడు. అందుకోసం రైలు బోగీ తలుపు హ్యాండిల్‌ను పట్టుకుని, దాంతో పాటు పరిగెడుతూ లోపలికి వెళ్లబోయాడు. అయితే.. అదే సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ఒక బ్యాగ్ అతని కాలికి తగలడంతో అతడు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. ఒక కాలు ప్లాట్‌ఫారమ్‌కు, రైలుకు మధ్య ఉన్న ప్రమాదకరమైన ఖాళీ స్థలంలోకి జారిపోయింది. కానీ, అతను రైలు హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకుని ఉండటంతో ఎలాగోలా రైలు లోపలికి ఎక్కగలిగాడు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఇలాంటి పనులు ప్రాణాలకే ముప్పని ఈ వీడియో హెచ్చరిస్తోంది.
ఈ వీడియో @rabiyask2021 అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ ఇలాంటి నిర్లక్ష్యానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘కొద్దిలో ప్రాణాపాయం తప్పింది.. లేదంటే ఈపాటికి అతని ఫొటోకు పూలదండ పడేది' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మళ్లీ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు 50 వేల జరిమానా
Read Latest AP News And Telangana News And International News And Telugu News