మళ్లీ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:57 AM
ఇరాన్‌తో త్వరలో శాంతి ఒప్పందం కుదురుతుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ప్రస్తుతం భారత్‌లోని వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్, ఇరాన్ మధ్య త్వరలో శాంతిఒప్పందం కుదురుతుందన్న అంచనాలతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వెండి ధర కూడా పెరగడం ప్రారంభించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (జూన్ 13) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,590గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,36,210ల వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2,65,100 పలుకుతోంది. విజయవాడలో కూడా ఇవే రేట్స్ కనిపిస్తున్నాయి.
ఇక చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,50,560గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,38,010 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.1,48,590గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,210గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,830 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,210 వద్ద ట్రేడవుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తలతో గత కొంత కాలంగా తిరోగమనంలో ఉన్న బంగారం ధరలు నిన్న ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసింది. త్వరలో ఇరాన్‌తో డీల్ ఉంటుందన్న ట్రంప్ ప్రకటనతో భారత్‌లో బంగారం రూ.2,940ల మేర పెరగ్గా వెండి ధర కూడా రూ.10 వేల మేర ఎగబాకింది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
చమురు చల్లారె.. బుల్ చిందేసె..
ప్రపంచ తొలి ట్రిలియనీర్ మస్క్