Viral Video: బల్లి కోసం అందమైన బట్టలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 11 , 2026 | 05:34 PM
సాధారణంగా ఎవరైనా కుక్కలు, పిల్లులు లేదా పక్షులు పెంచుకుంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించి బల్లిని పెంచుకుంటున్నాడు. అంతేకాదండోయ్.. దానికి ఫ్యాషనబుల్ డ్రెస్ కుట్టి తొడిగించాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో బల్లులు కనిపిస్తే చాలా మంది భయపడతారు. పైగా బల్లి మీద పడితే అరిష్టం అని అంటారు. అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లో బల్లులను తరిమికొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, రామచిలుక లాంటి పక్షులను ప్రేమతో పెంచుకుంటారు. కానీ, ఒక వ్యక్తి వీటన్నింటికీ భిన్నంగా బల్లిని పెంచుకుంటున్నాడు. అంతేకాదు.. దానికి అందమైన బట్టల వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వినడానికి వింతగా ఉన్నా, ఒక వ్యక్తి తన ఇంట్లో బల్లి మీద ప్రేమతో దానికి ప్రత్యేకంగా బట్టలు కుట్టించాడు. వీడియోలో కనిపిస్తున్నట్లు.. ఒకటి ఎల్లోకలర్ డ్రెస్. మరొకటి రెడ్ డ్రెస్‌పై ఎల్లో వర్క్ డిజైన్ చేసిన చిన్న కస్టమ్ కుర్తీ తయారు చేశాడు. చేతితో తయారు చేసిన కుర్తీ చాలా సరసమైన ధరకే రూ.20 అంటూ ఫన్నీగా కామెంట్ చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఆ వ్యక్తి సృజనాత్మకతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎన్నో రకాల జంతువులు డ్రెస్ వేసుకోవడం చూశాం.. వెరైటీగా బల్లికి తొడిగిన ఫ్యాషనేబుల్ డ్రెస్ భలే బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ బుల్లి బట్టలు వేసుకొని బల్లి అటూ ఇటూ తిరుగుతున్న వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..
ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..