Sankranti 2026 Mistakes To Avoid: మకర సంక్రాంతి 2026.. ఈ 4 తప్పులు చేస్తే అదృష్టం దూరమవుతుంది..
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:35 PM
మకర సంక్రాంతి నాడు కొన్ని సాధారణ తప్పులు మీ అదృష్టాన్ని దూరం చేస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ పవిత్ర రోజున చేసే తప్పులు ఏడాదంతా ప్రతికూల ఫలితాలు ఇస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మకర సంక్రాంతి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. ఉత్తరాయణాన్ని ప్రారంభిస్తుంది. దీనిని పంటల పండుగగా జరుపుకుంటారు. దానధర్మాలు, సూర్య భగవానుడిని పూజించడం వంటి వాటికి శుభ సమయంగా భావిస్తారు. అయితే.. మకర సంక్రాంతి నాడు కొన్ని సాధారణ తప్పులు మీ అదృష్టాన్ని దూరం చేస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ పవిత్ర రోజున చేసే తప్పులు ఏడాదంతా ప్రతికూల ఫలితాలు ఇస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి మకర సంక్రాంతి నాడు చేయకూడని ఆ 4 తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దక్షిణం వైపు ప్రయాణం
మకర సంక్రాంతి నాడు సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణం మొదలుపెడతాడు. అందువల్ల ఈ రోజున దక్షిణం దిశగా ప్రయాణించడం అశుభంగా భావిస్తారు. ఇది సూర్యుని శక్తికి విరుద్ధంగా చేసినట్లు పరిగణిస్తారు.

కోపం, అబద్ధాలు, గొడవలు
ఈ పవిత్ర రోజున కోప్పడటం, అబద్ధాలు చెప్పడం, గొడవలు చేయడం మంచిది కాదు. మకర సంక్రాంతి నాడు శాంతిగా ఉండాలి. మంచి మాటలు మాట్లాడాలి. అలా చేస్తే సూర్య భగవానుడి కృప లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మాంసాహారం, మద్యం
సంక్రాంతి రోజున మాంసాహారం, మద్యం వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది పవిత్రమైన రోజు. ఈ సమయంలో సాత్విక ఆహారం(కూరగాయలు, పాలు, బెల్లం, నువ్వులతో చేసినవి) తీసుకోవడం ద్వారా శుభం కలుగుతుందని.. దురదృష్టాన్ని, పేదరికాన్ని దూరం చేస్తుందని నమ్ముతారు. ఈ రోజున ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారంగా ఉండే ఆహారాలను కూడా నివారించడం మంచిది.

నువ్వుల దానం
సంక్రాంతి నాడు నువ్వులు తినడం, దానం చేయడం చాలా శుభం. అయితే.. నల్ల నువ్వులను దానం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. నల్ల నువ్వులు శనితో సంబంధం ఉన్నవిగా భావిస్తారు. మకర సంక్రాంతి సూర్యుడికి సంబంధించిన పండుగ కావడంతో.. సూర్య-శని విరుద్ధత వల్ల అశుభ ఫలితాలు వస్తాయని నమ్మకం.
సంక్రాంతి రోజు ఏం చేయాలి?
శుభ్రంగా ఉండాలి
ప్రశాంతంగా ఉండాలి
దానం చేయాలి
మంచి ఆలోచనలతో ఉండాలి
అలా చేస్తే సంవత్సరం మొత్తం శుభఫలితాలు వస్తాయని పెద్దల విశ్వాసం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
గాలిపటాల మధ్య ఘుమ ఘుమలు.. సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే..
పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు.. దీని వెనుక ఉన్న కథ ఇదే..
For More Latest News