Share News

ఎల్పీజీకి ప్రత్యామ్నాయాలున్నాయ్.. మరి LNG లేకపోతే రైతు పరిస్థితేంటి.?

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:13 PM

ప్రస్తుత కాలంలో ఎల్పీజీ లేకపోయినా సులభంగా వంటలు చేసుకోవచ్చు. కానీ ప్రకృతి ద్వారా లభించే ఎల్ఎన్జీ లేకపోతే రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' స్పందించారు.

ఎల్పీజీకి ప్రత్యామ్నాయాలున్నాయ్.. మరి LNG లేకపోతే రైతు పరిస్థితేంటి.?
India farmers LNG crisis

ఇంటర్నెట్ డెస్క్: గత కొన్నేళ్లలో నాగరికత ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ(లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) వినియోగం విస్తృత స్థాయిలో పెరిగినా.. ప్రకృతి నుంచి లభ్యమయ్యే ఎల్ఎన్జీ(లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్) మాత్రం కొరతగానే ఉంది. రైతుల ఉజ్వల భవిష్యత్తుకు మంచి శక్తివనరుగా మారిన ఎల్ఎన్జీ.. పెద్ద పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలకు దగ్గరవుతోంది. కానీ దీని కొరత కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 'ఎల్ఎన్జీ లేకపోతే.. 'రైతే రాజు' అని చెప్పుకునే మన దేశంలో అందరికంటే ఎక్కువ ఇబ్బందులు పడేది మాత్రం అన్నదాతలే' అని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భాను ప్రకాష్ కోగంటి ఎక్స్ వేదికగా స్పందించారు.


నేటి కాలంలో ఎల్పీజీ ద్వారా వంటలు సహా ఇతర గృహ అవసరాలకు ఢోకా లేదు. ఎల్పీజీ స్థానంలో సంప్రదాయ పద్ధతులైన మట్టిపళ్లలు, కట్టెల పొయ్యిలు సహా బయోగ్యాస్, సౌరశక్తి వంటి ప్రత్యామ్నాయాలున్నాయి. కానీ రైతుల అవసరాలు మాత్రం ఎల్ఎన్జీ మీదే ఆధారపడ్డాయి. వ్యవసాయ యంత్రాలు, ఇతర అవసరాల కోసం రైతులు ఎల్ఎన్జీని విస్తృతంగా వాడుతున్నారు. దీని ద్వారా రైతులకు తక్కువ ధరతో ఎక్కువ మోతాదులో ఇంధనం లభిస్తుంది. ఇదే లేకపోతే వ్యవసాయ రంగం తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎల్ఎన్జీ సాగునీటి వ్యవస్థలు, ముఖ్యంగా కృత్రిమ సాగునీటి ద్వారా వ్యవసాయం చేయడం వంటివి అర్ధంతరంగా నిలిచిపోయే అవకాశముంది.


భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశంలో అన్నదాతలు ఇప్పటికే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక.. ఎల్ఎన్జీ లేకపోతే పెరిగిన ఇంధన ధరల కారణంగా మరింత నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. సక్రమంగా వర్షాలు లేని పరిస్థితుల్లో వ్యవసాయంలో గణనీయమైన నష్టాలను ఎదుర్కొనే అవకాశముంది. ఫలితంగా అన్నదాత మరింత పేదరికంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఎల్ఎన్జీని రైతులు సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా మంచి ఊతమిస్తుంది. వ్యవసాయ రంగంలో ముఖ్యంగా సాగునీరు, వాతావరణ మార్పులకు తట్టుకునేలా ఎల్ఎన్జీ కీలకంగా మారుతుంది. ఎల్ఎన్జీతో తక్కువ ధరలు, మంచి ఉత్పత్తులు, నిరంతర సరఫరా వ్యవస్థ వంటి వాటితో రైతుల ఆర్థిక భారాన్నీ తగ్గించుకోవచ్చు.


అయితే.. ఎల్ఎన్జీ సరఫరా సమర్థవంతంగా జరుగుతున్నప్పటికీ.. ప్రసుత్తం అన్ని ప్రాంతాల్లో సక్రమంగా అందుబాటులో లేదు. అలాగే ప్రభుత్వాలు రైతుల కోసం ప్రత్యేక పథకాలు, సబ్సిడీల ద్వారా ఎల్ఎన్జీ వినియోగాన్ని మరింత విస్తరించాలి. ఫలితంగా సాగు రంగంలోని అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. లేని పక్షంలో ఎల్ఎన్జీ నష్టాలు.. దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.


ఇవీ చదవండి:

హరీశ్ రాణా కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

గురుగ్రామ్‌లో ఘోర ప్రమాదం.. మట్టి దిబ్బ కూలి ఏడుగురి మృతి

Updated Date - Mar 11 , 2026 | 01:03 PM