Share News

పశువుల కాపరిపై సింహం దాడి.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 06 , 2026 | 08:34 PM

గుజరాత్‌ భావ్‌నగర్ జిల్లాలో పలిటానా తాలూకాలోని గరజియా గ్రామంలో పశువుల కాపరిపై సింహం దాడి చేసింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పశువుల కాపరిపై సింహం దాడి.. వీడియో వైరల్

గాంధీనగర్, జులై 06: గుజరాత్‌ భావ్‌నగర్ జిల్లాలో పలిటానా తాలూకాలోని గరజియా గ్రామంలో పశువుల కాపరిపై సింహం దాడి చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సింహాన్ని గ్రామస్తులు బిగ్గరగా అరిచి, తరిమికొట్టడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పశువుల కాపరి కాళ్లను నేలపై సింహం అదిమిపట్టి ఉంచింది. అతని చేతిని దవడలతో బిగించి పట్టుకుంది. దీంతో అతడికి రక్తస్రావం అవుతుంది. విడిపించుకోవడానికి అతడు పదేపదే ప్రయత్నించాడు.


కానీ సింహం పట్టు వదలకుండా.. బాధితుడు తప్పించుకోకుండా అడ్డుకుంది. దాదాపు అరగంట తర్వాత ఆ సింహం ఆవులు కట్టేసి వైపు వెళ్లింది. దీంతో స్థానికులు వెంటనే పశువుల కాపరిని పలిటానా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. గాయపడిన వ్యక్తి పేరు కలుభాయ్ బోఘబాయ్ పర్మార్. ఆవులకు మేత వేయడానికి వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని అటవీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వారు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బామ్మ డెడ్‌లిఫ్ట్.. వీడియో వైరల్

నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్

For More Viral News And Telugu News

Updated Date - Jul 06 , 2026 | 08:58 PM