పిల్ల నుంచి తల్లిని వేరు చేసి.. చిరుత స్కెచ్ చూస్తే మతిపోవాల్సిందే..
ABN , Publish Date - Aug 14 , 2026 | 01:38 PM
ప్రపంచంలో అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జంతువుల వేట, వాటి మధ్య జరిగే పోరాటం, ప్రకృతి అందాలకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జంతువుల వేట, వాటి మధ్య జరిగే పోరాటం, ప్రకృతి అందాలకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అడవి జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు ఆశ్చర్యంతో పాటూ ఉత్కంఠను కలిగిస్తుంటాయి. అడవిలో అత్యంత వేగవంతమైన, చాకచక్యమైన వేటాడే కృర మృగాల్లో చిరుతపులి ఒకటి. తన వేగం, బలం, సమయస్ఫూర్తితో తన వేట కొనసాగిస్తుంది. తాజాగా ఓ చిరుత వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. చిరుత తన వేట కోసం అడవి పందిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత తల్లి పందిని దాని పిల్లకు దూరంగా తీసుకెళ్లిన చిరుత.. ఆ తర్వాత అవకాశం రాగానే.. పింది పిల్లలు ఉన్న గోతిలోకి దూరింది. అనంతరం ఒక్కసారిగా చిరుత పిల్లపై దాడి చేసి, పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే మొదట ఓ పంది పిల్ల తప్పించుకున్నప్పటికీ, మరో పంది పిల్ల చిరుతకు చిక్కింది. పంది పిల్లను నోట కరుచుకున్న చిరుత.. అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చిరుత వేట మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News