ఈ కండక్టర్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. ఎలా సేవ్ చేశాడో చూడండి..
ABN , Publish Date - Oct 31 , 2026 | 08:25 AM
జార్ఖండ్‌లోని దుమ్కాలో ఓ ప్రయాణికుల బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. నిటారుగా ఉన్న వాలుపై బస్సు వెనక్కి దొర్లుతుండగా.. కండక్టర్ సమయస్ఫూర్తితో స్పందించి టైర్ల కింద రాళ్లు పెట్టి బస్సు ఆగేలా చేశాడు..
ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌లోని దుమ్కాలో త్రుటిలో పెను రోడ్డు ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కూడిన బస్సు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి దొర్లడం ప్రారంభించింది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు కదులుతున్న బస్సు నుంచి కిందకు దూకారు. ఈ క్రమంలో బస్సు మరింత వేగంగా వెనక్కి వెళ్లకుండా అడ్డుకునేందుకు కండక్టర్ సాహసోపేతంగా వ్యవహరించాడు. వెంటనే పెద్ద రాళ్లను తీసుకొచ్చి బస్సు టైర్ల కింద పెట్టాడు. ఎట్టకేలకు కండెక్టర్ చొరవతో బస్సు ఆగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్సు వెనక్కి వెళ్తున్న సమయంలో ప్రయాణికుల అరుపులు.. కేకలతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కండక్టర్ భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ప్రమాదకర పరిస్థితుల్లోనూ ధైర్యంగా స్పందించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కండక్టర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి తక్షణ నిర్ణయం ఎంతోమంది ప్రాణాలను కాపాడిందని, నిజజీవిత హీరో అంటూ కొనియాడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!
మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు
For More AP News And Telugu News