Share News

దిండు ధర రూ.40 వేలు.. భారతీయ మహిళ వీడియో వైరల్

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:03 PM

భారత్‌కు చెందిన ఓ మహిళ అక్షరాలా 40 వేల రూపాయలతో ఓ దిండు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

దిండు ధర రూ.40 వేలు.. భారతీయ మహిళ వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు చెందిన ఓ మహిళా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) జపాన్ వెళ్లి ఒక దిండును కొనుగోలు చేశారు. తరువాత ఈ కొనుగోలుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది క్షణాల్లో వైరల్ అయింది. ఏంటీ.. దిండు కొన్నందుకే వీడియో వైరల్ అయిందా..? అని ప్రశ్నలు రావటం సహజమే. అయితే అది మామూలు దిండు కాదండి. దాని ధర అక్షరాలా నలభైవేల రూపాయలు. మంచి నిద్ర కోసం ప్రత్యేకించి చేశారు కాబట్టే ఆ తలగడకు అంత ఖరీదు.


విపన్‌దీప్ కౌర్ భారత్‌లో సీఏగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె జపాన్‌కు వెళ్లారు. అక్కడ నాలుగు వందల ఏళ్ల నాటి షాపు ఒకటి చూశారు. కస్టమైజ్డ్ మంచాలు, దిండ్లు చేయడానికి నిషికావా అనే ఆ షాపు ప్రసిద్ధి చెందింది.విపన్‌దీప్‌ కొంతకాలంగా మెడనొప్పితో బాధపడుతున్నారు. వృతిలో భాగంగా ఆమె అనునిత్యం ల్యాప్‌టాప్‌లతో కుస్తీ పడేవారు. దీంతో మెడనొప్పి ఇంకా ఎక్కువైంది. అందుకే కస్టమైజ్డ్ దిండు కొనాలనుకున్నారా సీఏ. అటు మెడనొప్పి తగ్గడానికి, ఇటు గాఢ నిద్ర పట్టడానికి పనికొచ్చేలా దిండు తయారు చేసి ఇవ్వాలని నిషికావా యజమానులను విపన్‌దీప్ కౌర్ కోరారు.


విపన్‌దీప్ కోరిక మేరకు నిషికావా యజమానులు దిండు తయారు చేయడానికి ముందుకొచ్చారు. అన్ని కొలతలూ తీసుకుని ఆమె మెడకు అనుకూలంగా ఉండే ఎత్తులో తలగడను సిద్ధం చేశారు. దిండుని బిన్‌చోటాన్ చార్కోల్ పైప్ బీడ్స్‌తో నింపేశారు. ఇవి మంచి నిద్ర పట్టడానికి సహకరిస్తాయని కొందరి నమ్మకం. ఈ తయారీకి సంబంధించిన వీడియోను విపన్‌దీప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ తలగడను తాను రూ.40 వేలకు కొనుగోలు చేశానని చెప్పారు. అంతే ఈ వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారింది.

చిన్న దిండు కోసం ఎందుకు అంత ఖర్చు చేయాల్సి వచ్చిందో విపన్‌దీప్ వీడియోలో వివరించారు. ‘నాకు వయసు పెరుగుతోంది. ఈ మధ్యనే నిద్రకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. మరోవైపు ల్యాప్‌టాప్ వాడకం వల్ల మెడనొప్పి కూడా ఎక్కువైంది. అందుకే ఖరీదు ఎక్కువైనా ఈ కస్టమైజ్డ్ తలగడ కొన్నాను’ అని ఆమె చెప్పారు. ఈ మొత్తం వ్వవహారంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.


ఈ వార్తలూ చదవండి

హైవేపై చెల్లాచెదురుగా పెళ్లి శుభలేఖలు.. అపరిచితుల సాయం చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు

హోటల్‌లోకి మొసలి.. షాకైన యజమాని, కస్టమర్లు..

Updated Date - Nov 06 , 2026 | 06:01 PM