హైవేపై చెల్లాచెదురుగా పెళ్లి శుభలేఖలు.. అపరిచితుల సాయం చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:33 PM
మనిషికి మనిషి చేసే సాయం కంటే గొప్పది మరొకటి లేదని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు మనసును హత్తుకుంటాయి. రక్తసంబంధం, కనీస పరిచయం లేకపోయినా.. కష్టంలో ఉన్న వ్యక్తిని ఆదుకునేందుకు ముందుకొచ్చే మంచి మనసులే మానవత్వానికి అసలైన నిదర్శనంగా నిలుస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మనిషికి మనిషి చేసే సాయం కంటే గొప్పది మరొకటి లేదని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు మనసును హత్తుకుంటాయి. రక్తసంబంధం, కనీస పరిచయం లేకపోయినా.. కష్టంలో ఉన్న వ్యక్తిని ఆదుకునేందుకు ముందుకొచ్చే మంచి మనసులే మానవత్వానికి అసలైన నిదర్శనంగా నిలుస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి పెళ్లి శుభలేఖలు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో కొందరు వాహనదారులు చేసిన సాయం ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటోంది.
ఓ వ్యక్తి తన సోదరి వివాహానికి సంబంధించిన శుభలేఖలను బంధువులకు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నాడు. అయితే, మార్గమధ్యంలో ప్రమాదవశాత్తూ బ్యాగు చిరిగిపోయింది. దీంతో వందల కొద్దీ పెళ్లి శుభలేఖలు రద్దీగా ఉన్న హైవేపై చెల్లాచెదురుగా పడిపోయాయి. రోడ్డుపై లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్తుండటంతో పడిపోయిన వాటిని సేకరించేందుకు ఆ యువకుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడే అక్కడ అసలైన మానవత్వం కనిపించింది. అతని ఇబ్బందిని గమనించిన కొందరు వాహనదారులు తమ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తమ వాహనాలను రోడ్డపక్కన నిలిపి శుభలేఖలను ఏరడం ప్రారంభించారు. అక్కడున్న వారెవరికీ ఆ వ్యక్తితో పరిచయం లేదు. అయినప్పటికీ, అతడి సమస్యను తమ సమస్యగా భావించి సహాయం చేశారు. అందరూ కలిసి చెల్లాచెదురైన శుభలేఖలను సేకరించి ఆ యువకుడికి అందించారు.
ఈ ఘటనకు సంబంధించిన 43 సెకన్ల వీడియోను నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అపరిచితులైనప్పటికీ ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేసిన వాహనదారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'చిన్నపాటి సాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద ఊరటనిస్తుంది' అని ఒకరు, 'మానవత్వం ఇంకా బతికే ఉంది' అని మరొకరు కామెంట్లు పెట్టారు. ప్రపంచంలో మనిషికి మనిషి చేసే సాయం కంటే గొప్పది మరొకటి ఉండదని మరికొందరు నెటిజన్లు ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి
హోటల్‌లోకి మొసలి.. షాకైన యజమాని, కస్టమర్లు..
ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి కానుక.. డెస్క్‌లపై స్మార్ట్‌ఫోన్లు.. వీడియో వైరల్