Share News

ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి కానుక.. డెస్క్‌లపై స్మార్ట్‌ఫోన్లు.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 05 , 2026 | 08:41 AM

దీపావళి వచ్చిందంటే చాలు.. ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే బహుమతులపై ఆసక్తి మొదలవుతుంది. చాలా సంస్థలు స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, సోహన్ పాపిడీ బాక్సులతో సరిపెడుతుంటే.. ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి కానుక.. డెస్క్‌లపై స్మార్ట్‌ఫోన్లు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా దీపావళి సందర్భంగా కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ హ్యాంపర్లు లేదా షాపింగ్ వోచర్లను అందించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఓ కంపెనీ మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించి ఉద్యోగులకు జీవితంలో గుర్తుండిపోయే బహుమతిని అందించింది.

ఆఫీసులోని ఉద్యోగుల డెస్క్‌లను అందంగా అలంకరించి, ప్రతి ఒక్కరి కంప్యూటర్, ల్యాప్‌టాప్ పక్కన ఎర్రటి రిబ్బన్‌తో చుట్టిన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉంచింది. ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న ఉద్యోగులు తమ డెస్క్‌లపై కొత్త ఫోన్లను చూసి ఆశ్చర్యపోయారు. తమకు లభించిన దీపావళి కానుకలతో సంబరాలు చేసుకున్నారు. కొందరు ఆనందంగా వీడియోలు, రీల్స్ చేస్తూ ఈ మధురమైన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.


ఈ వీడియో 'ఫైనాన్సర్‌సాబ్2.0'అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ పోస్ట్ చేశారు. ఇప్పటికే లక్షలాది వ్యూస్, 67 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు సైతం ఈ వీడియోపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఉద్యోగుల పట్ల ఇంత మంచి ఆలోచనతో బహుమతులు అందించిన కంపెనీని కొందరు ప్రశంసిస్తుంటే.. తమ సంస్థల్లో మాత్రం ఇప్పటికీ సోహన్ పాపిడీ బాక్సులు, రూ.500 వోచర్లే దక్కుతున్నాయని మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఫోన్ ఇచ్చినంత మాత్రాన సంబరపడిపోవద్దని, బోనస్‌లో కోత పెట్టి ఉంటారంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. మొత్తానికి దీపావళి సందర్భంగా ఉద్యోగులకు అందించిన ఈ వినూత్న కానుక సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 10:18 AM