Share News

జబల్‌పూర్‌లో దారుణం.. తల్లిని జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చిన కొడుకు.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 10 , 2026 | 07:32 AM

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 75 ఏళ్ల వృద్ధురాలిపై ఆమె కుమారుడు దాడి చేసి, జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపింది. వైరల్‌ అయిన సీసీటీవీ దృశ్యాలు స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తించాయి.

జబల్‌పూర్‌లో దారుణం.. తల్లిని జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చిన కొడుకు.. వీడియో వైరల్
Jabalpur Viral Video

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ వృద్ధురాలిపై ఆమె కుమారుడు దాడి చేసి, జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జబల్‌పూర్‌లోని రంఝీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ విహార్ కాలనీలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజీలో 75 ఏళ్ల మిత్ర విశ్వకర్మ ఇంటి నుంచి బయటకు వెళ్లడం.. కొద్దిసేపటికే భయంతో తిరిగి రావడం కనిపించింది. కొడుకు తన తల్లిని వెంబడించి, జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తోంది.


స్థానికుల కథనం ప్రకారం.. రాజు మద్యం సేవించి ఇంటికి వచ్చిన అనంతరం తల్లిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమెను ఇంటి బయటకు లాక్కెళ్లి రోడ్డుపై కూడా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అడ్డుకునేందుకు యత్నించిన కొంతమందితో దురుసుగా ప్రవర్తించి బెదిరించినట్లు తెలుస్తోంది. ఆతడు గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు.

ఇదిలా ఉంటే. వైరల్‌ అయిన సీసీటీవీ ఫుటేజీ తమ దృష్టికి వచ్చిందని రంఝీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఉమేష్ గోల్హానీ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసు బృందాన్ని పంపినట్లు చెప్పారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, సీసీటీవీ ఫుటేజీ సహా డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

మక్కా ఒప్పందంలో చేరనున్న ఈజిప్ట్.. టర్కీ కీలక ప్రకటన..

సౌదీ అరామ్‌కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన..

Updated Date - Aug 10 , 2026 | 01:26 PM