Share News

మక్కా ఒప్పందంలో చేరనున్న ఈజిప్ట్.. టర్కీ కీలక ప్రకటన..

ABN , Publish Date - Aug 09 , 2026 | 03:29 PM

నాటో తరహాలోనే మరో కీలక రక్షణ కూటమి రూపుదిద్దుకుంటోంది. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ ఇప్పటికే 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం' కుదుర్చుకున్నాయి. తమ ఒప్పందంలో ఈజిప్ట్ కూడా త్వరలో చేరబోతున్నట్టు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ వెల్లడించారు.

మక్కా ఒప్పందంలో చేరనున్న ఈజిప్ట్.. టర్కీ కీలక ప్రకటన..
Mecca Joint Defence Agreement

ఇంటర్నెట్ డెస్క్: నాటో తరహాలోనే మరో కీలక రక్షణ కూటమి రూపుదిద్దుకుంటోంది. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ ఇప్పటికే 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం' కుదుర్చుకున్నాయి. తమ ఒప్పందంలో ఈజిప్ట్ కూడా త్వరలో చేరబోతున్నట్టు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ వెల్లడించారు. కొన్ని సాంకేతిక అంశాలను పరిష్కరించిన తర్వాత ఈజిప్ట్ కూడా కూటమిలో చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు (Mecca Joint Defence Agreement).


టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆగస్టు 7న మక్కాలో జరిగిన సమావేశంలో మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలోని ప్రధాన అంశం ఏమిటంటే.. కూటమిలోని ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, అది మిగిలిన సభ్య దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. ఈ విధానం నాటోలోని సామూహిక రక్షణ సూత్రాన్ని పోలి ఉంటుందని టర్కీ విదేశాంగ మంత్రి తెలిపారు (Egypt Defence Alliance).


ఈ ఒప్పందంలో ఈజిప్ట్ కూడా చేరితే ఉత్తర ఆఫ్రికా నుంచి గల్ఫ్ ప్రాంతం వరకు మరింత ప్రభావవంతమైన రక్షణ వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంది (Middle East Defence Alliance). సుయెజ్ కాలువ వంటి అత్యంత వ్యూహాత్మక ప్రాంతం ఈజిప్ట్ పరిధిలో ఉంది. దీంతో కూటమిలో ఈజిప్ట్ చేరిక ప్రాంతీయ భద్రతా సమీకరణాలను ప్రభావితం చేయవచ్చు. కాగా, ఈ రక్షణ ఒప్పందం ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించలేదని టర్కీ స్పష్టం చేసింది. ఏ ఒక్క దేశాన్ని శత్రువుగా పేర్కొనలేదని హకాన్ ఫిదాన్ తెలిపారు.


ఇవి కూడా చదవండి

నీళ్లు లేకున్నా వేల ఎకరాలు పెంచారు!

స్విగ్గీ డెలివరీ బాయ్‌ ‘కథే’ వేరు!

Updated Date - Aug 09 , 2026 | 03:29 PM