మహిళ కనపడగానే ఈ రోబో ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 02 , 2026 | 08:07 AM
మనుషుల మధ్య తిరుగుతూ.. పలకరిస్తూ.. చివరికి ఓ మహిళతో సరదాగా తమాషా చేసేందుకూ ప్రయత్నించిన ఓ రోబో ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా రోబోలు తమ పనిని తాము చేసుకుంటూ కనిపిస్తాయి. కానీ ఈ హ్యూమనాయిడ్ రోబో మాత్రం ఓ కార్యక్రమంలో అతిథులతో కలిసిపోయి చేసిన సందడి అందరి దృష్టినీ ఆకర్షించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఓ కార్యక్రమంలో హ్యూమనాయిడ్ రోబోట్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. నారింజ రంగు టీ-షర్ట్ ధరించిన రోబోట్ హాలులో తిరుగుతూ అతిథులను ఆకట్టుకుంది.
ముఖ్యంగా మహిళల వద్దకు వెళ్లి కరచాలనం చేయడం, డిజిటల్ స్క్రీన్‌పై ముఖ కవళికలు చూపించడం, సరదాగా పలకరించడం వంటి చర్యలు అక్కడున్నవారిని నవ్వించాయి. రోబోట్ ప్రవర్తన మనుషులతో కలిసిపోయేలా ఉండటంతో పలువురు వెంటనే తమ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేశారు.
ఈ సరదా దృశ్యాలకు సంబంధించిన వీడియోను ‘సంజిద్_శువో’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసినట్లు పేర్కొంటున్నారు. వీడియో చూసిన నెటిజన్లు రోబోట్‌పై ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. ‘ఏఐ రోబోట్లు మనుషులతో సరదాగా మాట్లాడటం నేర్చుకుంటున్నాయి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘రోబోలతో కుర్రాళ్లు జాగ్రత్త ఉండాలి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఇక రోబోలతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్’ అని కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రయాణికులను కాపాడేది వాళ్లే.. ఎమర్జెన్సీలో జరిగేదేంటో ముందే చెప్పిన హీరో పైలట్
బకాయిలు చెల్లించక పోతే... ఎమ్మెల్యేల కమీషన్ల దందా బయటపెడతాం
Read Latest National News And Telugu News