కుక్కను చూసి భయపడి.. 40 అడుగుల బావిలో పడిపోయిన బాలిక
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:36 PM
కుక్కను చూసి భయపడటం ఆ బాలికకు ఊహించని ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఎదురైన కుక్కను తప్పించుకునే క్రమంలో అదుపుతప్పి ఏకంగా 40 అడుగుల లోతైన బావిలో పడిపోయింది..
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కైమ్‌గంజ్ ప్రాంతంలో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఓ బాలికకు అకస్మాత్తుగా కుక్క ఎదురుపడి మొరిగింది. దీంతో భయపడిన బాలిక.. తప్పించుకునే ప్రయత్నంలో అదుపుతప్పి సమీపంలోని సుమారు 40 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. బాలిక బావిలో పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. లోతైన బావిలో పడటంతో ఏం జరిగిందోనని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎంతో జాగ్రత్తగా బావిలోకి చేరుకున్న సిబ్బంది.. బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో రెస్క్యూ బృందం స్పందించడంతో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన రెస్క్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బావి నుంచి బాలికను బయటకు తీస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. సకాలంలో స్పందించిన రెస్క్యూ సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు.
వార్తలు కూడా చదవండి..
ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం
ఈ ఏడాది మరో 3వేల టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News