Share News

ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..

ABN , Publish Date - Aug 16 , 2026 | 04:38 PM

ఓ భారీ కొండచిలువ జనావాసంలోకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఏకంగా ఓ ఇంటి గుమ్మం వరకు చేరడంతో గ్రామస్తులు భయంతో ఉలిక్కిపడ్డారు. ఇంట్లోకి వెళ్లకుండా స్థానికులు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది..

ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..
Giant Python Meerut

ఇంటర్నెట్ డెస్క్: మీరట్‌లోని హసన్‌పూర్ కడిమ్ గ్రామంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. శుక్రవారం సమీపంలోని పొలాల నుంచి బయటకు వచ్చిన భారీ కొండచిలువ గ్రామంలోని చొరబడి.. చివరకు ఏకంగా ఓ ఇంటి వైపు పాకుతూ వెళ్లింది. కొండచిలువను చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడగా, పలువురు తమ ఫోన్లలో వీడియోలు తీశారు. కొండచిలువ ఇంట్లోకి ప్రవేశించకుండా స్థానికులు అడ్డుకున్నారు.


కొండచిలువ జనావాసంలోకి రావడంతో గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది.. స్థానికుల సహాయంతో కొండచిలువను జాగ్రత్తగా పట్టుకుని.. సహజ ఆవాసంలోకి విడిచిపెట్టారు. పెద్ద పాములను స్వయంగా పట్టుకునేందుకు ప్రయత్నించకుండా.. శిక్షణ పొందిన అటవీ లేదా వన్యప్రాణి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మేకను తినేందుకు వచ్చిన కొండచిలువ.. మద్యం మత్తులో యువకుడు ఏం చేశాడంటే..

భార్య కోరిక తీర్చేందుకు ఇల్లు అమ్మేశాడు.. 200 ఎకరాలను పూల తోటగా మార్చాడు..

For More Viral News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 05:48 PM