Share News

వామ్మో.. ఈ వధువుకు ధైర్యమెక్కువ.. సుడిగాలి కమ్మేస్తుంటే ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - May 06 , 2026 | 12:54 PM

పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని అంటుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా జరిగిపోతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నిజమని నమ్మక తప్పదు.

వామ్మో.. ఈ వధువుకు ధైర్యమెక్కువ.. సుడిగాలి కమ్మేస్తుంటే ఏం చేసిందో చూడండి..
wedding storm video

పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని అంటుంటారు. అలాంటి పెళ్లిళ్లు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా జరిగిపోతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఇది నిజమని నమ్మక తప్పదు. అందమైన పెళ్లి మండపం కాగితపు పడవలా ఊగిపోతున్నప్పటికీ, వేదికపై వధూవరులు మాత్రం చలించలేదు. బంధుమిత్రులందరూ పారిపోయినా వరుడి మెడలో దండ వేసిన తర్వాతే వధువు మండపం దిగింది (Wedding storm video).


వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెళ్లి కార్యక్రమం కనిపిస్తోంది (Brave bride viral video). ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు వీయడంతో పెళ్లి టెంట్ ఊగిపోయింది. డెకరేషన్ సామగ్రి ఎగిరిపోయింది. ఆ సమయంలో అక్కడున్న అతిథులు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నా, వధూవరులు మాత్రం స్టేజ్‌పైనే నిలబడి దండలు మార్చుకునే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గాలికి స్టేజ్ కదులుతున్నా కూడా వధువు ఎంతో ప్రశాంతంగా వరుడికి వరమాల వేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.


zindagi.gulzar.h అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు (viral social media video). లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'భార్య, తుఫాను ఒకేసారి వచ్చాయి' అని ఒకరు సరదాగా వ్యాఖ్యానించారు. 'ఇలాంటి భార్య దొరికితే, మీరు యమ ధర్మరాజుతో కూడా పోరాడవచ్చు' అని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..


ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా

Updated Date - May 06 , 2026 | 01:26 PM