Share News

Accident: ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై కారు యాక్సిడెంట్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jan 05 , 2026 | 06:09 PM

హర్యానాలోని నుహ్ సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై భయాంకరమైన కారు ప్రమాదం జరిగింది. కారు స్పీడ్‌గా హైవే నుంచి పక్కకు దూసుకువెళ్లి పల్టీ కొట్టింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Accident: ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై కారు యాక్సిడెంట్.. వీడియో వైరల్
Delhi Mumbai Expressway Accident

హర్యానాలోని నుహ్ సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై కారు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు తృటిలో తప్పించుకున్నారు. హైవే‌పై వేగంగా దూసుకువస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. వీడియోలో కనిపిస్తున్నట్లు ప్రమాదంలో కారు అదుపుతప్పిన సమయంలో పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగింది. కారు బాగానే దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది. వెంటనే అక్కడ ఉన్న వాహనదారులు, స్థానికులు కారు వద్దకు వెళ్లి అందులో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.


ఈ ఘటనలో ఒక వృద్ధురాలు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత ఓ పాప ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియదు కానీ, వీడియోలో మహిళ కారు డ్రైవర్‌ని ఆప్కీ ఆంఖ్ లగ్ థియా క్యా( నువ్వు నిద్ర పోతున్నావా) గట్టిగా అరవడం వినొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. గత నెలలో కూడా హర్యానాలోని నుహ్ జిల్లాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై పలు వాహనాలు ఢీకొన్నాయి. చలికాలంలో మంచు కురియడంతో ఇక్కడ వాహనాలు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

Updated Date - Jan 05 , 2026 | 07:56 PM