Share News

ఆకాశంలో నాట్యమాడిన డ్రోన్ల నెమలి.. గిన్నిస్ రికార్డు కైవసం

ABN , Publish Date - Oct 24 , 2026 | 09:14 PM

విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఆ నెమలి అందరి దృష్టిని ఆకర్షించేసింది. 3,473 డ్రోన్ల సహాయంతో ఆకాశంలో నాట్యం చేస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేసేసింది.

ఆకాశంలో నాట్యమాడిన డ్రోన్ల నెమలి.. గిన్నిస్ రికార్డు కైవసం

ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఆ నెమలి అందరి దృష్టిని ఆకర్షించేసింది. 3,473 డ్రోన్ల సహాయంతో ఆకాశంలో నాట్యం చేస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేసేసింది. ఆఖరికి గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకుందా నెమలి. దసరా వేడుకల్లో భాగంగా అక్టోబర్ 18న మైనుర్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో వేల డ్రోన్లతో ‘డ్యాన్సింగ్ పీకాక్’ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని చాముండేశ్వరి ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ (సీఈఎస్‌సీ) నిర్వహించింది.


ఈ డ్రోన్ల నెమలి ప్రదర్శన గిన్నిస్ బుక్ నిర్వాహకులనూ ఆకట్టుకుంది. ఇదే ఆకాశంలో ప్రదర్శించిన అతి పెద్ద పక్షి అంటూ వారు ప్రశంసించి, రికార్డుల్లో చోటు కల్పించారు. జాతీయ పక్షి నెమలికి ఈ రికార్డు దక్కడంతో భారతీయులు తెగ సంబరపడిపోతున్నారు. కాగా నెమలితో పాటు సీతాకోకచిలుక, సింహం, కర్ణాటక మ్యాప్, చాముండేశ్వరి అమ్మవారు, శివుడు, నంది, జాతీయ జెండా రెపరెపలాడేలా ఎగురవేస్తున్న సైనికుల రూపాలను ఈ డ్రోన్ల సహాయంతో ఆకాశంలో ప్రదర్శించారు. ఈ దృశ్యాలు చూసిన ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలూ వైరల్ అవుతున్నాయి.


ఈ వార్తలూ చదవండి

నెలల తరబడి గొయ్యిలోనే.. ప్రాణాల కోసం భయంకర పోరాటం.. చివరికి..

కలుపు మొక్కలు తినేందుకు మేకలకు ఉద్యోగం.. జపాన్‌లో వినూత్న ప్రయోగం! వీడియో వైరల్

Updated Date - Oct 24 , 2026 | 09:19 PM