Share News

గోడపైకి ఎక్కిన కోబ్రాను PVC పైపుతో పట్టేశాడు.. వీడియో చూస్తే గుండె ఆగాల్సిందే!

ABN , Publish Date - Aug 22 , 2026 | 08:38 PM

గోడపై పడగ విప్పిన ప్రమాదకరమైన కోబ్రాను ఓ వ్యక్తి కేవలం PVC పైపు సహాయంతో పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి సాహసం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు..

గోడపైకి ఎక్కిన కోబ్రాను PVC పైపుతో పట్టేశాడు.. వీడియో చూస్తే గుండె ఆగాల్సిందే!
PVC Pipe Cobra Rescue

ఇంటర్నెట్ డెస్క్: గోడపై పడగ విప్పిన ప్రమాదకరమైన కోబ్రాను ఓ వ్యక్తి కేవలం PVC పైపు సహాయంతో పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి సాహసం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా పాములను పట్టుకునే సమయంలో శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లు ప్రత్యేక హుక్స్, టాంగ్స్, క్యాచర్లు, సురక్షితమైన కంటైనర్లు వంటి పరికరాలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ వీడియోలో మాత్రం ఓ వ్యక్తి ఎలాంటి అధునాతన పరికరాలు లేకుండా PVC పైపుతోనే కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. గ్రామీణ ప్రాంతాన్ని తలపించే ప్రదేశంలో ఇటుకల గోడపై పెద్ద కోబ్రా ఎక్కి పడగ విప్పి కనిపించింది. ఇంతలో ఆకుపచ్చ టీషర్ట్, జీన్స్, టోపీ ధరించిన వ్యక్తి చేతిలో తెల్లటి PVC పైపుతో పాము దగ్గరకు వెళ్లాడు.


పైపు చివర మోచేయి ఆకారంలో ఉండే ఫిట్టింగ్‌ను అమర్చినట్లు కనిపించింది. ఎంతో జాగ్రత్తగా ఆ పైపును కోబ్రా తల వైపు తీసుకెళ్లగా.. క్షణాల్లో పాము తల పైపు లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వ్యక్తి పైపును నెమ్మదిగా అదుపు చేస్తూ కోబ్రాను పూర్తిగా దాని లోపలికి చేర్చాడు. చివర్లో పైపును చేతిలో పట్టుకుని కెమెరా వైపు చూస్తున్న అతడి దృశ్యం కనిపించింది. పైపు లోపల కోబ్రా ఉండటం స్పష్టంగా కనిపించడంతో వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో @earth_tracker అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఈయన ధైర్యానికి దండం పెట్టాల్సిందే’ అని, ‘కొంచెం మిస్ అయినా.. ప్రాణాలకే ప్రమాదం బ్రదర్..’ అని ఒకరు, ‘వావ్.. టెక్నిక్ భలే ఉంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల

జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి

For More National News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 09:12 PM